Search
Wednesday 21 November 2018
  • :
  • :

వర్షంతో రైతన్న హర్షం!

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలు 

పంటపొలాల్లో పత్తి, సోయాలకు జీవం
నేల తడవడంతో పనుల్లో నిమగ్నమైన రైతు

10admcl07p1మంచిర్యాల : ఉక్కపోతలు, రోజురోజుకీ పెరుగుతున్న ఊష్ణోగ్రతలు… ఇది నిన్నటి వరకు రైతన్నను ఆందోళన కలిగించిన వాతావరణ పరిస్థితులు. అల్పపీడణ ద్రోణి రైతుల ఆశలతో పాటు పంటపొలాల్లోని పంటలకు జీవం పోసింది. ప్రధానంగా పత్తి, సోయా పండిస్తున్న రైతులను ఈ వానలు ఆనందంలో ముంచెత్తాయి.
పొలంబాట ఒకవైపు…ఎరువుల కోసం మరోవైపు
నిన్నా మొన్నటి వరకు చినుకు కోసం ఎదురు చూసిన అన్నదాత వానలు కురియడంతో పొలంబాట పట్టాడు. ఒక వైపు పొలంలో పనులను చూస్తూనే మరోవైపు ఎరువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మార్కెట్లో ఎరువులు ఉన్నప్పుడే అందుకునేందుకు తాపత్రయ పడుతున్నాడు. అల్పపీడణ ద్రోణి ప్రభావం వల్ల మంచిర్యాల,ఖానాపూర్‌లలో తేలికపాటి ఝల్లులు కురియగా ఆసిఫాబాద్‌లో, నిర్మల్, ముథోల్, బోథ్‌లలో ఆశాజనకంగా వానలు కురిసాయి.జిల్లాలో శ్రీరాంపూర్‌లో అత్యధికంగా 12.6మి.మీ. వర్షపాతం నమోదైంది.
10admcl07p2పత్తి,సోయాలకు జీవం :
జిల్లాలో ప్రధానంగా పండించే పంటలు పత్తి,సోయా వీటికి ఈ వర్షంతో మేలు చేకూరినట్లయింది.జూన్ మొదట్లో కురిసిన వర్షాలతో మొలకలు మొలకెత్తగా మధ్యలో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో అల్పపీడణ ద్రోణి పుణ్యమా అని కరువుకోరల్లో అల్లాడుతున్న రైతులకు ఉపశమనం కల్గించాయి.

పనుల్లో బిజీబిజీ :
వర్షాలు కురియడంతో మొలకల మధ్య కలుపుతీత పనులు, గుంటుకుకొట్టడం, ఎరువులు చల్లడం లాంటి పనులు ఊపందుకున్నాయి.వీటి కోసం కూలీలను పిలుచుకునే పనుల్లో రైతులు కలియదిరుగుతున్నారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు తాపత్రయపడుతున్నారు.రెండు,మూడు రోజులుగా చినుకులు రాలిన ప్రాంతాల్లో పంటలు నిగనిగలాడుతున్నాయి.

Comments

comments