Home రంగారెడ్డి నాగులొస్తున్నాయ్.. జాగ్రత్త !

నాగులొస్తున్నాయ్.. జాగ్రత్త !

Farmers Be Careful With Snakes In Vanakalam

మనతెలంగాణ/పరిగి : వర్షాకాలం ఆరంభమైందంటే చాలు చాలా మంది ప్రజలు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పరిగి నియోజకవర్గంలో చాలా గ్రామీణ ప్రాంతాలు, తండాలు ఉండటం వల్ల ఎక్కువ మంది పాముకాట్లకు గురవుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ తండాలు ఉండటం వల్ల పొలాలు సమీపంలో, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఇళ్ల నిర్మించుకొని జీవిస్తున్నారు. వర్షాలు పడటం వల్ల పొలాలు, కాలువగట్లు, భూమిలోకి నీరు ఇంకడం వల్ల పాములన్నీ బయటికి పరిగెత్తుకొస్తుంటాయి. వెచ్చని ప్రదేశాలు వెతుక్కుటూ ఇళ్లు, పాకలు, పొలం పనులు చేస్తూ, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాట్లకు గురవుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు మండలాల్లో నిరక్షరాస్యులు, అమాయక ప్రజలు ఉండటం వల్ల పాముకాటు గురవగానే నాటు వైద్యం, మంత్రాలు అంటూ కాలయాపన చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ప్రతి యేటా నియోజకవర్గంలో పది మందికిపైగా పాముకాట్లకు గురై మృత్యువాత పడుతున్నారు. పాముకాట్లకు గురై సరైన సమయంతో ప్రాథమిక చికిత్స చేయకపోవడం, నాటు వైద్యులను ఆశ్రయింప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పూడూరు మండలంలో  వర్షాలు కాస్త విస్తారంగా పడ్డాయోలేదో పాముల సంచారం మొదలైంది. పూడూరు మండలం మిర్జాపూర్ గ్రామంలో అంజయ్య అనే వ్యక్తి పొలం పనులు            నిర్వహిస్తూ      పాముకాటుకు          గురై