Search
Tuesday 17 July 2018
  • :
  • :

పొంగిపొర్లుతున్న దయ్యాలవాగు

Farmers Cultivation Works Start In Jayashankar District

మన తెలంగాణ/గోవిందరావుపేట : మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దయ్యాల వాగుతో పాటు సమీప అడువులో ఒర్రెలు పొంగి పోర్లుతున్నాయి. అంతేకాకుండా గత 15 రోజుల క్రితం లక్నవరం సరస్సు ఆయకట్టు కాల్వల కింత రైతులు వరినారు మళ్లు పోసుకోవడం జరిగింది. కాగా పోసిన వరినారు మళ్ళీ నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు నేలలో వేసుకున్న బోరుబావు కింద వరినారు మళ్ళు ఎండిపోకుండ రక్షించుకున్నారు. ఎక్కువ మంది రైతులు వర్షం పై బారం వేసుకొని నారుమళ్లు పోసుకున్నారు. ఎట్టకేలకు శుక్రవారం నుండి వర్షాలు కురువడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లు వెరిసింది. దయ్యాల వాగు పరివాహక ప్రాంతం ఇరువైపుల ఉన్న రైతులు ముందుగా విద్యుత్ మోటార్లకి నార్లు పోసుకున్న రైతులు వరి నాట్లు వేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఏది ఏమైన వర్షం పడడంతో మరల వారి విత్తనాలకు లక్షలాది రూపాయలు తప్పాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments