Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎన్నాళ్లీ ఎదురు చూపులు

Farmers Demond Open Vegetable market in Tirumalagiri

మనతెలంగాణ/తిరుమలగిరి : అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం గా ఈ కూరగాయాల షెడ్డ్‌లు దర్శ నం ఇస్తున్నాయి. అన్ని ఉన్న అల్లు డు నోట్లో శని ఉన్న చందంగా…ఈ కూరగాయల షెడ్డ్‌లు నిర్మించి ఎనిమిది సంవత్సరాలు కావోస్తున్న ప్రారంభానికి నోచుకోకుండా దర్శనం ఇస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల క్రితం తిరుమలగిరి మండల కేంద్రం లో పశువుల సంతలో కేంద్ర ప్రభుత్వం ఆడాక్స్ సంస్థ్ధ ఆధ్వర్యంలో రూ 4.40వేలు గ్రామ పంచాయతీ నుండి రూ60వేలతో కూరగాయాల షెడ్డ్‌లను నిర్మించారు. ప్రజఅవసరాల నిమిత్తం నిర్మించి వృధాగా వదిలి వేయడంతో ప్రజలు ,కూరగాయల వినియోగ దారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇప్పటికైన అధికారులు ప్రభుత్వం సోమ్ము వృథా కాకుండా వెంటనే కూరగాయాల మా ర్కెట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎనిమిది సంవత్సరాల నుండి నిరుపయోగం
గత ఎనిమిది సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉం టుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూరగా యాల మార్కెట్ ఏర్పాటు చేయా లన్నారు.
– బోడ సోమయ్య తిరుమలగిరి

ఆదికారుల నిర్లక్షనికి నిదర్శనం
నిరుపయోగంగా ఉంటున్న పశువుల సంతాన్ని కూర గాయాల మార్కెట్‌కు ఉప యోగపడేలా అధికారులు , ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కందుకూరి రోశయ్య
(టిడిపి మండల అధ్యక్షులు)

Comments

comments