Search
Wednesday 21 November 2018
  • :
  • :

గులాబీ పంట ..లాభాల పూబాట

Farmers Earn Huge Money With Red Rose Crop

మన తెలంగాణ/ వికారాబాద్ రూరల్ : రైతన్నలు ఒకే రకమైన పంటలను సాగుచేసి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పంటల సాగులో వివిధ రకాలను పండించుటకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టు బడితో ఎక్కువ లాభాలు సాధించాలని కొత్త ఆలోచనలో పడ్డాడు. ఉద్యోగికి నెల తిరిగితే చేతికి డబ్బులు వస్తాయి. రైతన్నకు ఆ ఆశలు ఉండవు. కానీ కొత్త కొత్త ఆలోచనలతో నిత్యం చేతిలో (డబ్బులు) గవ్వలు ఆడేటట్లు రైతులు చూసుకుంటున్నారు. అందులో భాగంగానే విరుల పంటను ఎన్నుకొని సాగేచేసి లాభాలను ఆర్జిస్తున్నాడు. కొంగొత్త ఆలోచనలతో పంటలను సాగుచేస్తే డబ్బుకు కొరత ఉండదంటున్నాడు. వికారాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ సర్పంచ్ ఎర్రవల్లి సు భాన్‌రెడ్డి, సరళ దంపతులు 3 ఎకరాల పొల ంలో గులాబీ పంటతో సిరులు పండిస్తున్నాడు. దుక్కిని రెండు సార్లు దున్ని పొలాన్ని చదును చేయాల్సి ఉంటుంది. దుక్కిని దున్నక ముందు సేంద్రియ (పశువుల ఎరువును) ఎరువును చల్లుకోవాలి. చదును చేసిన పొలంలో బోదెలను తయారు చేసుకోవాలి. ప్రతి బోదెపై డ్రిప్ పైపులను, మల్చిన్ పేపర్‌ను పరవాలి. ఒక్క ఎకరా పొలంలో వెయ్యి మొక్కల చొప్పున 3 ఎకరాల పొలంలో మూడు వేల మొక్కలను నాటాల్సి ఉం టుంది.  మేలు రకం జాతి గులాబీ మొక్కలను ఎన్నుకొని రెండు మొక్కల మధ్య దూరాన్ని పాటిస్తూ నాటుకోవాలి. గులాబి మొక్కలను నాటిన తరువాత 3 లేదా 4 నెలల్లో గులాబీ పంట చేతికొస్తుంది. గులాబి విరుల లో చిన్నవి, పెద్దవి పూలు వస్తే వేరు వేరుగా తెంపాలి. చిన్న సైజు పూల కు విఫణిలో ధర ఎక్కువగా ఉం టుంది. కిలో సుమారు రూ.100లకు అ మ్ముకోవచ్చు. పెద్ద సైజు పూలు కిలో సుమారు రూ.60ల నుంచి రూ. 70ల వరకు విఫణిలో ధర ఉంటుంది. పూలు తెంపడానికి ఒక్కొక్క కూలీకి రూ.200లు ఖర్చు అవుతుంది. రోజుకు ముగ్గురు కూలీల చొప్పున 8 రోజులలో మొత్తం పంటను తీయాల్సి ఉంటుంది. ముగ్గురు కూలీలకు రో జుకు ఖర్చు రూ.600లు, 8 రోజులకు మొ త్తం కూలీల ఖర్చు రూ.4,800లు అవుతుంది. ఒక్క ఎకరాకు సంవత్సరానికి రూ.40,000ల చొప్పున 3 ఎ కరాలకు రూ.1, 20,000లు ఖర్ఛు ఆవుతుంది. మ ల్చిన్ పేపర్ ఒక చుట్టకు రూ.2,000ల చొప్పున 15 చుట్టలు 3 ఎకరాలకు అవసరమవుతుంది. డ్రిప్ పై ప్‌కు ఒక ఎకరాకు పదివేల చొప్పున 3 ఎకరాలకు ము ప్పై వేల ఖర్చు అవుతుంది. లాగోడి పెట్టుబడి, కూలీల ఖర్చు, రవాణా ఖర్చులు పోను సం.నికి రూ.90,000 ల నుంచి రూ.1,00,000ల గిట్టుబాటు అవుతుంది.

Comments

comments