Home జయశంకర్ భూపాలపల్లి విఆర్‌ఒలను బంధించిన రైతులు

విఆర్‌ఒలను బంధించిన రైతులు

VROభూ పట్టాలు ఆన్‌లైన్ చేయాలని నిరసన
రెవెన్యూ నిర్లక్షంపై రైతుల ఆగ్రహం
లంచం ఇచ్చిన వాళ్లకే ధరణిలో చేరుస్తున్నారు
లిఖిత పూర్వక హామీతో విఆర్‌ఒల విడుదల

మల్హర్: భూములకు పట్టాలు చేయటం లేదని ఆరోపిస్తూ ఇద్దరు విఆర్‌ఒలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించిన సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో చోటుచేసుకుంది. విఆర్‌ఒలు రవి,సురేందర్‌లు తమ భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వడంలేదని గదిలోకి తోసి తాళం వేశారు. తహసీల్దార్ వచ్చి తమకు పట్టాలు ఇస్తామని హామీ ఇస్తేనే విఆర్‌ఒలను వదులుతామని పలువురు రైతులు స్పష్టం చేశారు. పట్టాలుఉన్నా భూములను ధరణిలో చేర్చడం లేదని , సంవత్సరాల కొద్ది పలు మార్లు ఆధార్,పట్టాపాసు పుస్తకాలు ఇచ్చినా చెత్త బుట్టలో వేసి కాలం వెల్ల దీస్తున్నారని,దీంతో ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును,రుణ సహాయాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తహసీల్దార్ రావాలని పట్టాలు చేస్తానని హామీ ఇస్తేనే తాళం తీస్తామని డిమాండు చేశారు.

భూముల ఆన్‌లైన్ చేయాలంటే లంచం అడుగుతున్నారని, లంచం ఇవ్వని రైతులకు ఇప్పటి వరకు ఆన్‌లైన్ చేయడం లేదని గ్రామంలో సుమారు 700 ఖాతాలు ఉంటే సగం వరకు కూడా ఆన్‌లైన్ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరలో పట్టాలు,ఆన్‌లైన్ చేస్తామని తహసీల్దార్ పోనులో హామీ ఇవ్వగా, విఆర్‌ఒలు ఐదు రోజుల్లో మీ భూములను పట్టాలు చేసిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు వారిని విడిచిపెట్టారు.

Farmers Fires on VRO At Jayashankar Bhupalpally