Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చెక్కుల పంపిణీ బహిష్కరించిన గిరవెల్లి గ్రామ రైతులు

Farmers from Girwelli village who were expelled from the distribution of checks

మన తెలంగాణ /దహెగాం: గిరవెల్లి గ్రామంలో చాలా మందికి రైతు బంధు పథకంలో చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని నిరసనగా శుక్రవారం అధికా రులు నిర్వహించే చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీని గ్రామస్థులు బహిష్కరించారు. గ్రామంలో అర్హతగల రై తులు చాలా మంది ఉన్నారని సర్వే సమయంలో అధికా రులు సరిగ్గా నమోదు చేయకపోవడం వలన అర్హులైన చాలా మంది రైతులు నష్టపోతున్నారని రైతులు అవేదన వ్యక్తం చేశారు. రైతులు సుమారు కొన్ని గంటలపాటు కార్యక్రమాన్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తు పంపి ణీ కేంద్రం బయటఆందోళన చేశారు.గ్రామస్థులు మా ట్లా డుతు గ్రామంలో సాగులో ఉన్న భూములకు చాలా మందికి చెక్కులు పాస్ పుస్తకాలు రాలెదని అన్నారు. గ్రామంలో 399 ఖాతాలు ఉంటే 90 ఖాతాల వరకు పాస్ పుస్తకాలు రాలేదని రైతులు తెలిపారు. అందరికి న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని ఎండను సైతం లెక్క చేయకుండా నిరసన తెలిపారు. గిరవెల్లికి చేరుకున్న ఆర్‌డీవో రమేష్‌బాబు రైతులతో మాట్లాడి అర్హులైన అందరికి పట్టా పాస్ పుస్తకాలు అందేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతు పథకం కార్యక్రమంలో తహసీల్దార్ బికర్ణదాస్, డీసీసీబీ డైరక్టర్ తాళ్ళపల్లి శ్రీరామరావు ,ఎస్సై దీకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments