Home రాష్ట్ర వార్తలు ఆశల వర్షం!

ఆశల వర్షం!

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తలలూపుతున్న పైర్లు

రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

కొన్ని ప్రాంతాల్లో పంట ముంపు

పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న జిల్లాల్లో లోటు వర్షపాతం

crop

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తం గా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు సంతోషం తో పాటు ఆందోళనను కూడా కలిగిస్తున్నాయి. ఒకవైపు ఇన్ని రోజులుగా నిండని రిజర్వాయ ర్లు, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతుం ది. పది రోజుల క్రితం సాధారణ జల్లులతోనే మురిపించిన వర్షాలు వారం రోజుల వరకే పం టలను కాపాడుతాయని, తరువాత పరిస్థితి ఏంటి అని అనుకున్నారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలకు డోకా లేదని చెబుతున్నారు. పంటల స్థితిపై ప్రత్యామ్నాయ దిశగా ఆలోచించిన వ్యవసాయ శాఖ వానలతో ఊపిరి పీల్చుకుంది. ఈ వర్షాల తో వరినాట్లు పడుతాయని ఆశిస్తోంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరి నారుతో పాటు పెసరు, కంది, మొక్కజొన్న వంటి పంటలు నీట మునుగుతుండటంతో దిగు లు చెందుతున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పెసరు పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలో ని శ్రీరాంసాగర్, కామారెడ్డిలోని పోచారం, సింగితం, కళ్యాణి ప్రాజెక్టులలోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ రెండు జిల్లాలకు ముఖ్యమైన నిజాంసాగర్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు లక్ష్మీ కెనల్‌కు నీటిని విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి వాగు ఉప్పొంగడంతో కొన్ని గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో వందలాది ఎకరాల్లో వరినారు మళ్ల నీట మునిగాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా సాగవుతనన మొక్కజొన్న, జొన్న పంటలకు ఈ వర్షాలు ఊపిరి పోసాయి. కర్నాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వరద నీటితో నిండుతోంది. సిద్దిపేట, మెదక్ జిల్లాలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఘన్‌పూర్ ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులలో నీటిమట్టం పెరిగింది. మిగతా జిల్లాలతో చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు తగిన స్థాయిలో పడటం లేదు. కేవలం జగిత్యాల్ జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న జిల్లాలలో ఇంకా లోటు వర్షపాతమే ఉండటం గమనార్హం. యాదాద్రి జిల్లాలోనూ సాధారణ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో 4 మండలాల్లో, నల్లగొండ జిల్లాలో 6మండలాల్లో జల్లులు పడ్డాయి. నాగర్జున్ సాగర్‌లో నీరు లేకపోవడంతో అక్కడి ఆయకట్టు ప్రాంత రైతులు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే : దామరగిడ్డ 7 సెం.మీ, మహబూబ్ నగర్ 6 సెం.మీ, జడ్చర్ల 6 సెం.మీ, ఖమ్మం కోహెడ 6 సెం.మీ,మక్తల్ 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా రుద్రూర్‌లో 5 సెం.మీ, ఉమ్మడి మహబూబ్ నగర్ మాగనూర్, నారాయణపేటలలో 5 సెం.మీ, ఉట్నూర్, ఎల్లారెడ్డిలలో 4 సెం.మీలు, ఉమ్మడి వరంగల్ జిల్లా మోగులపల్లెలో 4 సెం.మీ, రంగారెడ్డి గండీడ్ 4 సెం.మీల వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల 3 సెం.మీల నుంచి 1 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది.