Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

తగ్గని చెక్కుల రద్దీ

Farmers,front,banks,farmer's, checks,Telangana news,Telugu news,Mana Telangana news,Telangana news Paper,TS news,Telangana news Telugu,Telangana Breaking News,Latest Telangana news,Latest TS news,TS news Paper,Telugu Paper,Latest Telugu news,Telugu news Paper,Latest Telangana news,TS news Today,Mana Telangana ePaper,news in Telangana,Telangana news,Telugu news,Rajanna Sircilla news,Rajanna Sircilla Paper,Rajanna Sircilla Jilla news,

రైతు బంధు చెక్కులతో బ్యాంకుల ముందు రైతుల బారులు
పెద్దనోట్ల రద్దునాటి వాతావరణం పునరావృతం

మనతెలంగాణ/సిరిసిల్ల: రైతుబంధు చెక్కులను అందుకున్నరైతులు వాటిని నగదుగా మార్చుకునేందుకు శనివారం  సిరిసిల్లలోని బ్యాంకుల ముందు బ్యాంకులు తె రువక ముందే పెద్దసంఖ్యలో వరుసలు కట్టడం కనిపించింది. తెల్లవారితే ఆదివారం కావడం,బ్యాంకులు మూ సివేస్తారు కాబట్టి శనివారం రైతుల రద్దీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు పె ట్టుబడి సహాయాన్ని పంటలపెట్టుబడులకు వినియోగించుకుని రైతులు అభివృధ్ధి చెందాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించిన నేపథ్యంలో రైతులు బ్యాంకులముందు రైతుబంధు చెక్కులతో క్యూలు కట్టారు. బ్యాంకుల ముందు శనివారం నాటి రైతుల వరుసలు చూస్తే కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన కొత్తలో బ్యాంకుల ముందు ప్రజలు కట్టిన వరుసలు జ్ఞప్తికి వ చ్చాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబం ధు చెక్కుల పంపిణీ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసి మంత్రి కెటిఆర్ ప్రశంసలు అందుకుంది. రా ష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రైతుబంధు చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పం పిణీ కార్యక్రమాన్నిఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సూచన మేరకు సిరిసిల్ల జిల్లాలో ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 11న ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు. జిల్లాలోని 13 మండలాల్లో గల 171 రెవెన్యూ గ్రామాల్లోని 1,05,074మంది రైతులకు రూ.97,37,49, 610  పంపిణీ చేయడంకోసం 1,05,693 చెక్కులను, 95, 718పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. బ్యాంకు సిబ్బంది రైతులకు చెక్కుల క్లియరెన్స్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని మంత్రి కె టిఆర్ స్యయంగా బ్యాంకులకు వెళ్లి చెప్పడంతో అధికారులు కూడా రైతులకు తగిన వసతులు ఏర్పాటు చేసి ఒ పికగా రైతులకు నగదును అందిస్తున్నారు.

Comments

comments