Search
Monday 24 September 2018
  • :
  • :

బీమా.. రైతుకు ధీమా

Farmers Insurence Scheme Support To Farmers

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఖరీఫ్‌లో పంట సాగు చేస్తున్న రైతులకు అండగా ఉండి సాగుకు పెట్టుబడి కోసం ఎకరంకు రైతు బంధు పథకం కింద నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 5,04,578 మంది రైతులకు రూ. 553 కోట్లను ప్రభుత్వం అందచేసింది. 5.04 లక్షల మంది రైతులకు బీమా వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. బీమా కంపెనీల నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల లోపు 59 సంవత్సరాలకు పైబడి వయస్సు కల రైతులకు బీమా పథకం అమలు చేయలేమని చేతులు ఎత్తేయడంతో మిగిలిన రైతులందరి పేర్లను ప్రత్యేక దరఖాస్తు ఫామ్‌లో నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ప్రతి రైతు వద్ద నుంచి వ్యక్తిగత దరఖాస్తు ఫామ్‌లను సేకరిస్తున్న అధికారులు వాటిని యుద్ద ప్రాతిపదికన కంప్యూటర్‌లలో నమోదు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 2,18,107 మంది రైతులకు బీమా వర్తిస్తుంది. వ్యవసాయ శాఖలో తక్కువ సిబ్బంది ఉన్నా ప్రతి రైతును వ్యక్తిగతంగా కలసి వివరాలను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.45 లక్షల మంది రైతుల నమోదు ప్రక్రియ పూర్తి చేశామని మిగతా రైతుల నమోదు సైతం చురుకుగా కొనసాగిస్తున వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నారు. నమోదు చేసిన ప్రతి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పరచడానికి ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పటికే 1,15,000 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లాలో మరో 73107 రైతుల వివరాలను నమోదు చేయవలసి ఉంది. వికారాబాద్ జిల్లాలో సైతం 1.60 లక్షల రైతుకు బీమా పథకం వర్తింపచేస్తున్నారు. జిల్లాలో రైతుల నమోదు చురుకుగా సాగుతున్న ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో వెనకబడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని గ్రామీణ మండలాల్లో రైతు బీమా చురుకుగా సాగుతుంది.

ముందుకు రాని బడా రైతులు…
రైతులకు ఎలాంటి ఆపద రాకుండా సకల చర్యలు చేపడుతు ప్రభుత్వం అండగా నిలుస్తుండగా ఎదైన ప్రమాదంలో మరిణించిన కుటుంబంకు ఆసరాగా ఉండటానికి ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంకు బడా రైతులు దూరంగా ఉంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో బడా బడా వ్యాపారస్తులు, కార్పొరేట్‌లు, ప్రజా ప్రతినిధులు వందల ఎకరాల భూములు ఉన్నాయి. రైతు బందు పథకం క్రింద చెక్కులను తీసుకోవడానికి కొంత మంది ముందుకు రాకపోగా వచ్చిన పలువురు వాటిని ప్రభుత్వంకు తిరిగి ఇచ్చి రైతుల సంక్షేమంకు వినియోగించాలని కోరిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు లక్ష మంది రైతులు రైతు బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరి దగ్గరకు వెళ్లి రైతు బీమా నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి పథకం అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. రైతుల వివరాలను నమోదు చేయడానికి మొదట నిర్ణయించిన గడువు ముగిసిన ఈ నెల 17 వరకు దానిని పెంచింది. రైతులందరికి న్యాయం చేయాలన్న సంకల్పంతో మరోక రోజును పెంచి ఈ నెల 18తో నమోదు పూర్తి చేయాలని తక్షణం వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేయడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీమా నమోదు చేసుకోని రైతులు ఈ నెల 18లోపు ఖచ్చితంగా నమోదు చేసుకుని సహకరించాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గీతారెడ్డి కోరుతున్నారు.

Comments

comments