Home ఆదిలాబాద్ సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి

సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి

 

Farmer's life insurance scheme is to support the poor family

అన్నదాత కుటుంబాలను ఆదుకునేందుకే రైతు జీవిత బీమా పథకం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
రైతు సమన్వయ సమితి సభ్యులకు, అధికారులకు అవగాహన

మన తెలంగాణ/ఆదిలాబాద్ : సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి అని రైతుల కోసం సిఎం చేపడుతున్న పథకాలను నాయకులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రలో రైతు బంధు, సాముహిక జీవిత బీమా పథకాలపై మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ శాఖ అధికారులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, ఐకె రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు జీవిత భీమా పథకం విధి విధానాలపై అధికారులకు, నాయకులకు సంపూర్ణ అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ప్రమాదవశత్తు, ఆకస్మికంగా, అనారోగ్యంతో మరణిస్తే ఆ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతు జీవిత బీమా పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు.ఈ బీమా పథకం అమలులో భాగంగా రైతుకు నచ్చిన కుటుంబ సభ్యులను నామినీగా ఎన్నుకునే అవకాశం రైతులకు కల్పించామన్నారు. ఈ పథకంలో గ్రామాల్లోని 18 నుండి 60 ఏళ్ల వయస్సున్న రైతులు అర్హులు అని బీమాకు అవసరమైన ప్రీమియం 2271.50 రూపాయలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలోని 57 లక్షల మంది రైతుల్లో దురదృష్టవశాత్తూ ఎవరు మరణించిన 10 రోజుల్లోనే వారి ఇంటికి 5 లక్షల రూపాయల పరిహరం చేరుతుందని భరోసా ఇచ్చారు. జిల్లాలో ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలున్న వారితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతలకు సైతం ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. ఆగస్టు 15 నుండి రైతులకు జీవిత భీమా బాండ్‌లను పంపినీ చేస్తామన్నారు. జూన్ చివరి వరకు జిల్లా వ్యాప్తంగా రైతుల పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్నదాతలకు అండగా ఉంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో బాద్యత భుజానికి ఎత్తుకుందని, ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత జీవిత భీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. ఈ పథకం అమలులో గ్రామాల్లోని రైతు సమన్వయ సమితుల సభ్యులు రైతు జీవిత పథకంపై విస్తృత స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. శనగ పంట అమ్మిన రైతులకు ఇది వరకే 63 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమాచేశామని తెలిపారు. సోయాబీన్ పంట విత్తనాలు మొలకెత్తని వారికి తిరిగి విత్తనాలనే సరఫరా చేస్తామని రైతులు ఎలాంటి బెంగ పట్టుకోవద్దని అన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను విజయవంతం చేయాల్సిన బాద్యత రైతు సమన్వయ సమితి సభ్యులపై ఉందన్నారు. ఈ పథకం అమలులో సభ్యులు కీలక పాతర పోషించి అధికారులకు సహకరించాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ రైతు రాజ్య స్థాపనకు సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు, 24 గంటల విద్యుత్, రైతులకు పంట పెట్టుబడి ద్వారా సంవత్సరానికి రూ. 8వేలు, చివరకు రైతు కుటుంబాలను ఆ దుకోవటానికి రైతు జీవిత భీమా పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈకార్యక్రమంలో ఎంఎల్‌సీ పురాణం సతీష్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలకు చెందిన ఎంఎల్‌ఏలు, వ్యవసాయ కమీషనర్ జగన్మోహన్, జిల్లా వ్యవసాయాధికారులు, మండల, గ్రామస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల సమన్వయ కర్తలు పాల్గొన్నారు.