Home తాజా వార్తలు వృద్ధి సరే.. ఉద్యోగాలెక్కడ?

వృద్ధి సరే.. ఉద్యోగాలెక్కడ?

Former Governor Raghuram Rajan

 

ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తగినంతగా ఉపాధి అవకాశాలను కల్పించడం లేదని, వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత్ వృద్ధి రేటులో వేగంగా దూసుకెళ్తోందని గొప్పలకు పోవడం కాదని, తగినంతగా ఉద్యోగాల సృష్టి ఎక్కడ ఉందని ఆయన అన్నారు. 90 వేల రైల్వే జాబ్‌లకు 2.5 కోట్ల మంది దరఖాస్తు చేశారని, అంటే ఒక్కో ఉద్యోగానికి 250 మంది పోటీ పడుతున్నారని అన్నారు. దీని ఆధారంగా భారత్‌లో ఉద్యోగాల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని రాజన్ అన్నారు. ఇతర ఆర్థికవేత్తలతో పాటు భారత్‌కు ఆర్థిక వ్యూహ రచన జరగాలని అన్నారు. గత ఐదేళ్లలో భారత్ ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించలేదని శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. ద్రవ్య లోటును పూడ్చుకోవ డం చాలా అవసరమని, ఆర్థిక వృద్ధి మెరుగుపడాలంటే జిడిపి వృద్ధి 7 శాతానికి పైగా నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రైతులకు రుణ మాఫీ సరైన పరిష్కారం కాదు
భాదలో ఉన్న రైతులకు రుణమాఫీ సరైన పరిష్కారం కాదని రాజన్ వ్యాఖ్యానించారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని తరచూ రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడాన్ని ఆయన విమర్శించారు. ఇటువంటిది ఉండకూడదని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ రంగానికి, రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అంతమాత్రాన రుణమాఫీలు చేయడం, పంట మద్దతు ధర పెంచుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వంటివి సరికాదని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి హామీల వల్ల ఆర్థిక వ్యవస్థకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగాలొ చ్చే రంగాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

farmers Loan waiver is not the right solution

Telangana Latest News