Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఊపందుకున్న ఖరీఫ్

Farmers' pots for labor

జోరుగా వరినాట్లు                                                                                                                                  చెరువులు,కుంటల్లో నీటికళ
జిల్లాలో పెరిగిన వరి సాగు                                                                                                                                          కూలీల కోసం రైతుల పాట్లు

మనతెలంగాణ/పెద్దపల్లి: గత పది రోజులు వరుసగా కురిసిన వర్షాలతో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందు కున్నాయి. చెరువులు,కుం టలు నీటితో కళకళ లాడుతున్నాయి. వ్యవసాయ బావుల్లో నీటి మ ట్టం గణనీయంగా పెరగడంతో రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న ఇతర ఆరుతడి పంటలు ఏపుగా ఎదగడంతో కలుపు తీస్తున్నారు.మానేరు, హుస్సేన్‌మియా వాగులను ఆ నుకొని ఉన్న మండలాలైన సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఒదెలలో జూన్ మొదటి వారంలో నార్లు పోయడంతో ఆయా ప్రాంతాల్లో నాట్లుచివరి దశకు చేరుకున్నాయి. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, కమాన్‌పూర్, మంథని, ముత్తారం, అంతర్గాం, పాలకుర్తి మండలా ల్లో కొంత ఆలస్యంగా నార్లు పోయడంతో ఇప్పుడిప్పుడే నాట్లు ప్రా రంభమయ్యాయి. ఒక వైపు వరి నాట్లు మరో వైపు పత్తి,మొక్క జొ న్నఇతర ఆరుతడి పంటలలో కలు పు తీస్తుండడంతో కూలీల కొరత తీ వ్రంగా ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని తదితర పట్టణ ప్రాంతాల నుంచి కూలీలను రైతులు తరలిస్తున్నారు. గడిచిన ఖరీఫ్‌లో 150రూపాయలు న డిచిన కూలీ రేట్లు అమాంతం 2వందలు చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలకు తోడు కూలీలు సైతం రేట్లు పెంచడంతో ఈ సారి పెట్టుబడి వ్యయం కొ ంత పెరగనున్నప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 4వేల చొప్పున ఇచ్చిన చె క్కులకు తోడు, మద్దతు ధర క్వింటాలుకు 200పెరగడం తమకు కలిసి రానుందని రైతులు సంతోషంగా ఉన్నారు.

జిల్లాలో పెరిగిన వరి సాగు
పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఆయకట్టు 2.5లక్షల ఎకరాలు కాగా చెరువులు,కుం టల ద్వారా 50వేల ఎకరా లు,బావుల కింద 80 వేల ఎకరాలు,1.2 లక్షల ఎకరాలు కాలవల కింద సాగవుతున్నాయి.గడిచిన ఖరీఫ్‌లో లక్ష ఎకరాల్లో వరి,ల క్ష ఎకరాల్లో పత్తి,20 వేల ఎకరాల్లో మొక్కజొన్న 10వేల ఎకరాల్లో కంది మిగతా విస్తీర్ణంలో ఇతర ఆరుతడి పంటలను సాగు చేశారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పత్తి,కంది పంటలు గణనీయంగా త గ్గాయి.1.35 లక్షల ఎకరాల్లో వరి,80 వేల ఎకరాల్లో పత్తి,20వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేస్తుండగా మి గతా మొత్తంలో కంది,పెసర, మినుములు,మిర్చి సోయా తదితర ఆరుతడి ప ంటలు సాగవు తున్నాయి.గడిచిన ఖరీఫ్‌తో పోల్చితే ప్రస్తుతం 35వేల ఎకరాల్లో వరి సాగు పెరిగింది.

Comments

comments