Home జయశంకర్ భూపాలపల్లి పాలంపేటలో రైతుల ధర్నా

పాలంపేటలో రైతుల ధర్నా

Farmersములుగు జిల్లా ప్రతినిధి : వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అప్పటి నుంచి పాలంపేట గ్రామంలో రైతులు పండించిన పంటను పిఎసిఎస్ కేంద్రానికి తీసుకెళ్లినప్పటికీ  అధికారులు రైతుల ధాన్యాన్ని కొనడం లేదు. దీంతో రైతులు శనివారం ప్రధాన రహాదారిపై  ధర్నా చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ధాన్యాన్ని కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టం చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పటికి వరి కోసి ధాన్యాన్ని పిఎసిఎస్ కేంద్రంలో కోసి పది, పదిహేను రోజులు అయిన ధాన్యాన్ని కాంటాలను పెట్టడం లేదని రైతులు పేర్కొన్నారు. ములుగు జిల్లా నూతనంగా ఏర్పడినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులను ఐకెపి కేంద్రాలైన, పిఎసిఎస్ కేంద్రాలు మోసం చేయకూడదని రైతులు పండించిన పంటను మాచర్ రాయడంతో పాటు రైతుల ధాన్యాన్ని కాంటాలు వేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని  రైతులు వణికిపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు పడిగాపులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.  ఇప్పటికైన రైతులు పండించిన పంటలు వెంటనే కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు పిఎసిఎస్ అధికారులను డిమాండ్ చేశారు. వెంకటాపూర్ ఎస్ ఐ నరహరి ఆధ్వర్యంలో రైతులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బండి శ్రీనివాస్, రామ్మోహన్ రావు, రాజు, రైతులు , గ్రామస్థులు పాల్గొన్నారు.

Farmers Protest At Palampet In Mulugu