Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

దుర్గంగుట్ట బ్యారేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

Barrage

కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.1600కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామసమీపంలోని గోదావరినదిపై చేపడుతున్న దుర్గంగుట్ట బ్యారేజీ నిర్మాణ పనులను శనివారం గ్రామంలోని భూనిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తుపాకులగూడెంలో బ్యారేజీ నిర్మాణం కోసం పీసా చట్టంపై శుక్రవారం గ్రామసభను స్థానిక సర్పంచ్ ఆలం సంతోష్ అధ్యక్షతన జరిగింది.

ఈసమావేశానికి ములుగు సబ్ కలెక్టర్ విపి.గౌతం హాజరై బ్యారేజీ నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని భూ రిజిస్ట్రేషన్ విలువపై ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తామని అన్నారు. ఈవిషయంపై భూ నిర్వాసితులు పరిహారంతోపాటు తమకు ప్రభుత్వం తిరిగి వ్యవసాయ భూములను ఇప్పించాలని వారు తెగేసి చెప్పడంతో గ్రామసభను సబ్ కలెక్టర్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. శనివారం ప్రాజెక్టు పనులను సంబంధిత కాంట్రాక్టర్ చేపడుతుండగా గ్రామంలోని భూనిర్వాసిత రైతులు, మహిళలు పనుల వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ఈసందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపరిహారంతోపాటు తమకు తిరిగి వ్యవసాయ భూములను ఇప్పించాలని, అప్పుడే ప్రాజెక్టు నిర్మాణ పనులకు సహకరిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన 12టిప్పర్లు, 12ప్రొక్లెయిన్ యంత్రాలు ఖాళీగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

comments