Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రతిష్ఠాత్మకంగా రైతు బంధు పథకం

KTR-IMAGE

జిల్లా నుండి 25 వేల మంది రైతులు
రాష్ట్ర ఐటి,మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు బంధు పథకం ప్రారంభ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 25వేల మంది రైతులు పాల్గొనేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు.ఆదివా రం పొదుపు భవన్‌లో రైతు బంధు పథకం ప్రారంభ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాకు ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మే 10వ తేదీన హుజురాబాద్ వేదికగా సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రైతు బ ంధు పథకం ప్రారంభ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భారతదేశం మొత్తం మనవైపే చూసేలా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం రైతు బంధు పథకం అని వెల్లడించారు.దేశానికే ఆదర్శంగా నిలవనున్న ఈ కార్యక్రమాన్ని పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తే జయప్రదం అ వుతుందని భావించి ముఖ్యమంత్రి కెసిఆర్ హుజురాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారని తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం లక్ష మంది రై తులు పాల్గొనేలా ప్రారంభ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి 25వేల మందికి తగ్గకుండా రైతు లు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. రైతులు హుజురాబాద్‌కు వచ్చేందుకు వీలుగా సిరిసిల్ల నియోజకవర్గంనుంచి200,వేములవాడనియోజకవర్గంనుండి 200, ఇల్లంతకుంట మండలం నుంచి 50, బోయిన్‌పల్లి మండ లం నుంచి 50మొత్తంగా 500టిఎస్ ఆర్‌టిసి బస్సులను జి ల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుందన్నారు.ఉదయం 8 గంటలకు బస్సులు బయల్దేరేలా, ఉదయం 10 గంటలలో పే వేదిక వద్దకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంకు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, వేములవాడ నియోజకవర్గంకు ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేశ్‌బాబులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారన్నా రు. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అధిక ప్రయోజనం, రైతు బంధు పథకం ద్వారా రూ.100కోట్ల మేర పంట సాయం లభిస్తుందన్నా రు. ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించి రైతు లు అధికసంఖ్యలో సభకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, బ స్సులకు పచ్చని తోరణాలు కట్టి పండుగ వాతావరణం లా సభకు చేరుకునేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. జి ల్లా లో మే 11 నుంచి 17 వరకు రైతు బంధు పథకం చెక్కు ల పంపిణీ చేపట్టాలన్నారు. ఉదయం 7 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చెక్కులను పంపిణీ చేయాలన్నారు. జిల్లా నుండి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లిన భూ యజమానులకు సంబంధించి చెక్కులు మే 17 తర్వాత పంపిణీ చేయాలన్నారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు, వారి కుటుంబాలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే ప్రజాప్రతినిధులు వాటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఇంత పెద్ద కార్యక్రమంలో తప్పిదాలుంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు. గొప్ప కార్యక్రమం విజయవంతం చేయడానికి విస్తృత ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

comments