Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రైతు బాంధవుడు.. సిఎం కెసిఆర్..

Farmers' Relatives CM KCR

వనపర్తి రూరల్‌: రైతుబంధు పథకం దేశానికే మార్గదర్శకమైందని, సిఎం రైతుల పాలిట రైతు బాంధవుడయ్యారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండల పరిధిలోని రాజపేట గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అర్హులైన రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో లక్ష 52వేల 25మందికి పాస్‌పుస్తకాలు, లక్ష 40వేల 90 చెక్కులు, రాజపేట గ్రామంలో 680 పట్టాదారు పాస్ పుస్తకాలు, 840 రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో రైతుబంధు 64 కేంద్రాల్లో రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చెక్కులను 90 రోజుల్లో నగదు తీసుకోవచ్చని తెలిపారు. రూ.13 లక్షల వ్యయంతో ప్రతి గ్రామంలో రైతుసమన్వయ సమితి భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతుబంధు ద్వారా రైతుల పెట్టుబడి సాయం కోసం సిఎం కెసిఆర్ రైతుబంధును అమలు చేసి ఆదుకోవడం జరుగుతుందన్నారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకే రైతుబంధును సిఎం ప్రారంభించారన్నారు.

సిఎం సహాయనిధి అందజేత..

అంతకు ముందు సవాయి గూడెం గ్రామానికి చెందిన బుచ్చారెడ్డికి రూ. లక్ష సిఎం సహాయనిధి చెక్కును రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అందజేశారు. నిరంజన్‌రెడ్డి వెంట మార్కెట్ చైర్మన్ ఎత్తం రవికుమార్, ఎంపిపి శంకర్‌నాయక్, లోక్‌నాథ్ రెడ్డి, రాము, ఉన్నారు.

టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..
అనంతరం రాజపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. నిరంజన్‌రెడ్డి నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజవర్ధన్‌రెడ్డి, చిన్నారెడ్డిలు టిఆర్‌ఎస్‌లో చేరారు.

Comments

comments