Search
Friday 16 November 2018
  • :
  • :

రైతు బంధుపై కలెక్టర్ సమీక్ష

Farmers'-Scheme

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: రైతుబంధు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలోని తహసీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ సమయంలో రైతు ఎవరైనా అనారోగ్యంతో రాకపోతే ఆ రైతుకు సంబంధించిన చెక్కును నేరుగా సిబ్బంది ఆ రైతు ఇంటికి అందజేయాలని కోరారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా తహసీల్దారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. చెక్కుల పంపిణీలో ప్రకటించిన సమయానికంటే ముందే సిబ్బంది అక్కడికి చేరుకోవాలని తెలిపారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఎవరి భాధ్యతలని వారు సక్రమంగా నిర్వర్తించాలని లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలోసమావేశంలో అన్ని మండలాల తహసీల్దార్‌లు, విఆర్‌వోలు, విఆర్‌ఎలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments