Home తాజా వార్తలు బాబు పాలనలో రైతులందరికీ కష్టాలే: జగన్

బాబు పాలనలో రైతులందరికీ కష్టాలే: జగన్

Praja Sankalpa Yatra Started in AP

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా నుంచి టిడిపికి 17 మంది ఎంఎల్‌ఎలు ఉన్నా అభివృద్ధి శూన్యమని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కొబ్బరి రైతులు ఆందోళనలో ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధరలేదని, చేపలు, రోయ్యలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రైతులందరికీ కష్టాలే పడుతున్నారని, అక్వా రైతుకు రూ.1.50కే కరెంట్ ఇస్తామని పేర్కొన్నారు. గోదావరి ప్రవహిస్తున్నా తాగడానికి నీళ్లుండవని, ముమ్మడి నియోజక వర్గంలో 40 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు.