Home రాజన్న సిరిసిల్ల గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం

మూడు జిల్లాల్లో గాలివాన బీభత్సం,వడగండ్ల వాన
పిడుగుపాటుకు ఒకని మృతి
అన్నదాత కంట్లో కన్నీరు
రాలిపోయిన మామిడి పూత,పిందెలు
నేలవాలిన మొక్కజొన్న, వరి పంట
కూలిన విద్యుత్ స్థంభాలు
వేములవాడల్లో దుకాణసముదాయాల్లో చేరిన నీరు
కంటితుడుపుగా అధికారుల పర్యటన

Heavy-Rain

మానకొండూర్: మం గళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిం చింది. గాలివాన బీభత్సంతో మండలంలోని పలు గ్రామాలలో పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు అరగంట పాటు వేగంతో కూడిన గాలివర్షం రావ డంతో మొక్కజొన్న, వరి పంటతో పాటు మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలుపుతు న్నారు. మండలంలోని గంగిపల్లి, లక్ష్మీపూర్, పచ్చు నూర్, అన్నారం, చెంజర్ల, ఖాదర్‌గూడెం గ్రామా లలో గాలివానతో మామి డితోటల్లో పిందెలు రాలాయి. మొక్కజొన్న నేలవాలడంతో రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖాదర్‌గూడెం గ్రామానికి చెందిన టి.అంజనేయులు అనే రైతు ఎకరం మొక్క జొన్న పంట గాలివాన కారణంగా నేలవాలింది. సుమారు రూ.30వేలు పెట్టుబడి పెట్టి ఎకరంలో మొక్కజొన్న పంట వేయగా గాలివానతో పంట మొత్తం నేలవాలిపోయిందని రైతు అంజనేయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మండలంలో పలు చోట్ల పిడుగులు వేయడంతో టివిలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైనట్లు సమాచారం. గాలివాన భీభత్సం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

గంగాధరలో: కరీంనగర్ జిల్లా గంగాధర మండ లంలో వడగళ్ళ వాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంతో పాటుబూర్గుపల్లి,లక్షీదెవిపల్లి, కురి క్యాల, ఉప్పర మల్యాల,రంగరా వుపల్లి,గర్శకుర్తి, తాడిజెర్రి గ్రామాలలో ఈదురు గాలులతో పాటు వర్షం రావడంతో మామిడి పూతలు రాలి పోయి రైతులకు నష్టం వాటిల్లింది. మండలంలోని బూర్గుప ల్లిలో కురిసిన వర్షానికి కొల పాక లచ్చమ్మ కు చెందిన ఇల్లు ద్వంస మవడంతో పాటు గ్రామం లోని ఎల్లమ్మ గుడి దగ్గర కరెంటు స్తంబాలు విరిగి పోయి నాయి. కరెంటుకు తీవ్ర అంతరాయం కల్గింది. ఉరుములు మెరుపులతో కురిసిన ఈ వడగళ్ళ వాన ప్రజలను భయాంభ్రాంతులకు గురి చేసింది.
సుల్తానాబాద్‌లో: జమ్ముకాశ్మీర్‌లో భూకంపం రావ డంతో వాతవ రణంలో వచ్చిన మార్పుతో సుల్తానా బాద్ మండల కేంద్రంలో మెస్తారు వర్షం మంగళ వారం సాయంత్రం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత పదిరోజులుగా తీవ్ర రూపంలో కొడుతున్న ఎండలతో ప్రజలు

ఇబ్బం దులు పడుతు న్నారు.

వేములవాడలో : పట్టణంలో మంగ ళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేసవికాలం ప్రారంభ మైనప్పటికి ప్రతి రోజు ఎండలు కొడుతున్న సమ యంలో ఒక్కసారిగా ఇలా వర్షం రావడంతో పట్ట ణంలో ఆహ్లద వాతావరణం నెలకొంది. పట్టణ వాసు లు ఆనందం వ్యక్తం చేశారు. కానీ.. ఆలయం లోని ప్రధాన రోడ్లు జలమయం కాగా దుకాణసము దా యాలోకి నీరు చేరడంతో దుకాణ యజమానులు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు.

గోదావరిఖనిలో: మహాశివరాత్రి పండుగా సాక్షిగా ఎండలతో మండిపోతున్న రామగుండం ప్రాంతంలో మంగళవారం ఉదయం వర్షపు జల్లులు కురియడంతో స్థానికులు ఎంతో ఊరట చెందారు. మంగళవారం ఉదయం 11గంటలకు పది నిమిషాల పాటు స్వల్ప వర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీల్లోని రోడ్లు, ఇళ్లపైకప్పులు వర్షపు జల్లులతో శుభ్రంగా మారాయి. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడం, ఈదురు గాలులు వీయడంతో స్థానికులు సంబురపడ్డారు.