Home నల్లగొండ వర్షం..హర్షం

వర్షం..హర్షం

Farmers Starting Cultivation Works In Nalgonda Dist

మనతెలంగాణ/నల్లగొండ ప్రతి నిధిః వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీ డనం తదనను గుణంగా ఉప రితల ఆవర్త నం కొనసాగు తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాతావరణ శాఖ 3రోజుల పా టు తేలికపాటి, ఓ మోస్తారు వ ర్షాలు కురుస్తాయని చేసిన ప్రక టన కు అనుగుణంగా శనివా రంతో పాటు ఆదివారం కూడా వర్షం కురువడంతో రైతులు హర్షాతిరేకాలు వ్య క్తం చేస్తున్నారు. రెండో రోజు ఉదయం ఆకాశం మెఘా వృ తమై చిరుజల్లులు కురిసిన నేప థ్యంలో ప్రధాంగా మెట్ట పం టలకు మేలు జరుగు తుం డడంతో రైతుల్లో ఆనందో త్సా హాలు వెల్లివిరుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 267.7 మి. మీ వర్ష పా తం నమోదు కాగా జిల్లా సగటు వర్షపాతం 10.2మి. మీ నమోదు అయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షపాతంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు దుక్కులకు దున్నుకొని సిద్దంగా ఉన్న వారు పత్తి విత్తనాలునాటుతుండగా, మిగిలిన రైతాంగం దుక్కులు దున్నుకునే పనుల్లో నిగమ్నమయ్యారు. దీంతో ఇంతకాలం మందకోడిగా సాగిన ఖరీఫ్ సాగు, ప్రధానంగా పత్తిపంటల సాగు రెండు రోజుల పాటు కురిసిన ఓ మోస్తారు వర్షాలతోనైనా ఊపందుకోనుంది.
కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదుః జిల్లాలో గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అధికశాతం ఓ మోస్తారుగా ఉన్నా, మరికొన్ని ప్రాంతాల్లో అధికమొత్తంలో వర్షపాతం నమోదు అయ్యింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్,మేళ్ళచెర్వు చింతలపాలెం, మఠంపల్లి తదితర ప్రాంతాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ఆయా ప్రాంతాలో ఎడతెరపి లేకుండా వర్షం కురియడంతో హూజూర్‌నగర్, మోత్కూరు తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ఇదిలా ఉండగా త్రిపురారంలో 23.0మి.మీ, నకిరేకల్ 21.2, నిడమనూరు 20.8, చండూరు17.6, హాలియా 16.4, కనగల్ 15.6, నల్లగొండ 15.4, గుర్రంపోడు 13.0, వేములపల్లి 12.4, మిర్యాలగూడ 12.4, దామరచర్ల 12.4, చింతపల్లి 11.8, తిప్పర్తి 11.4, దేవరకొండలో 10.2మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారిక సమాచారం.
పట్టణ ప్రజలకు ఈరటః రుతుపవనాలు ప్రవేశించి జూన్ మొదటివారంలో వర్షాలు ఊరించినా ఆ తర్వాత ముఖంచాటేయడం, వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంలో పట్టణ ప్రజలు సైతం కొంతకాలం ఉక్కపోతతో సతమతమయ్యారు. ఎట్టకేలకు రెండు రోజలు ఆకాశం మెఘావృతమై చిలుజల్లులు కురుస్తుండడం పట్టణ ప్రాంత ప్రజలకు ఊరట లభించింది. రెండు రోజులు అడపాదడపా విరామం తప్ప ఆగకుండా తేలికపాటి జల్లులు కురుస్తున్నా తమ తమ రోజులవారి కార్యకలాపాలను నిరాటంకంగా నిర్వర్తించుకున్నారు. జలుల్లల నుంచి కాపాడుకునేందుకు గొడుగులు, పాల్థీన్ కవర్‌లను రక్షణ వాడుకుంటూ చిరు జల్లుల ఆస్వాదించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో కొంతమంది వర్షంలో తేలికపాటి జల్లులను ఆస్వాదించుకుంటూ వర్షాన్ని ఆస్వాదిస్తూ తమ పనుల్లో నిగమ్నమయ్యారు. మొత్తానికి వర్షాకాలం మొదలైనట్లేనని భావించుకున్న ఆయా వర్గాలు తదననుగుణంగా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు.