Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పట్టాపాస్ బుక్‌లు ఇంకెప్పుడు ఇస్తారు…

Farmers Strike About Patta PassBooks In Kamareddy Dist

మనతెలంగాణ/నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు పట్టాపాస్‌బుక్‌లు ఇంకెప్పుడు ఇస్తారని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. భూప్రక్షాళన పకడ్బందీ, పట్టాపాస్‌బుక్‌లు మండలంలోని ఆయా గ్రామాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పట్టాపాస్‌బుక్‌లు అందకపోవడంపై రైతులు ఆగ్రహంతో నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మండలంలోని జలాల్‌పూర్, చిన్నూర్, తాండూరు, మాల్తుమ్మెద, నాగిరెడ్డిపేట ఇతర ఆయా గ్రామాల రైతులు మాకు పట్టాపాస్‌బుక్‌లు ఇంకెప్పుడు ఇస్తారని పాస్‌బుక్‌లు ఇవ్వకపోవడం వల్ల మేము అనేక నష్టాలకు గురికావాల్సి వస్తుందని, బ్యాంకుల్లో పంటల రుణాలు రెన్యూవల్ చేసుకుందామంటే, వేసుకున్న పంటలపై ఫసల్ బీమా చేసుకుందామంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమాకు అనర్హులవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహించారు. పైవన్నీ రైతులకు వర్తించాలంటే కనీసం పట్టాదారులు రాతపూర్వక పహణీలు అయినా ఇవ్వాలని రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఆయా గ్రామాల రైతులు చేరుకుని వారితో పటు ఆయా గ్రామాల అధికార పార్టీ ప్రతినిధులు కొందరు కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

కార్యాలయంలో ఉన్న ఎల్లారెడ్డి ఆర్డిఓ దేవేందర్, నాగిరెడ్డిపేట తహసీల్దార్ సాహిద్ హమ్మద్‌లను పాస్‌బుక్‌ల పంపిణీ నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్‌ఓలు సరిగా పనిచేయడం లేదని పనిచేసిన పనిచేయని వారిని బదిలీ చేయడం లేదా విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎవరు ఉండడం లేదని ప్రజలకు అందుబాటులో విఆర్‌ఓలు ఉంటున్నారా అని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పకడ్బందీ భూప్రక్షాళన భూరికార్డుల కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండలంలోని కొన్ని గ్రామాల విఆర్‌ఓలు అశ్రద్ధ వహించి రైతులను నష్టాలపాలు చేస్తున్నారని, మండల కార్యాలయాన్ని డివిజన్ కార్యాలయానికి మార్చారని జడ్పిటిసి కాశి నారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆర్డిఓ దేవేందర్‌రెడ్డిని, తహసీల్దార్‌లను నిలదీసారు. రైతులకు వెంటనే పాస్‌బుక్‌లు అందజేయాలని డిమాండ్ చేశారు. పాస్‌బుక్‌లు రాని రైతులకు ప్రస్తుత సమస్యల పరిష్కారం కోసం, బీమాలు వర్తింపచేసుకునే సౌకర్యం రెవెన్యూ అధికారులు మా భూములను చేతివ్రాతతో ధృవీకరించి పహణీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమం సుమారు గంటసేపు నిర్వహించారు. దీంతో ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శేఖర్ ఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. తహసీల్దార్‌ను రైతుల వద్దకు పిలిచి కావాల్సిన డిమాండ్లను పరిష్కరించి కృషి చేస్తానని తహసీల్దార్ తెలపడంతో రైతులు ఆందోళనను మరికొంత సేపు కొనసాగించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం సరికాదని ఎస్సై రైతులతో చెప్పడంతో రైతులు, ప్రజాప్రతినిధులు సద్దిమణిగి రోడ్డుపై నుండి వెళ్లిపోయారు.

Comments

comments