Home తాజా వార్తలు ట్రాన్స్‌పోర్ట్ లారీలు రాక నిలిచి పోయిన వరి ధాన్యం

ట్రాన్స్‌పోర్ట్ లారీలు రాక నిలిచి పోయిన వరి ధాన్యం

Paddy grain purchase center

 

తుంగతుర్తి: మండల కేంద్రంలో రైతు సైవా సహాకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైయిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి రైతులు ధాన్యాన్ని తీసుకు రావడం జరిగింది. ప్రారంభం నాటి నుండి నాలుగు రోజుల కిందటి వరకు తూకాలు కాగానే ట్రాన్స్‌పోర్ట్ లారీలు రావడంతో ఎప్పటి ధాన్యం అపుడు తరలించడం జరిగిందని సిఈఒ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం నుండి 17వ తేదీ వరకు 10 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం గత నాలుగు రోజులుగా ట్రాన్స్ పోర్ట్ లారీలు రాక తూకాలు వేసిన ధాన్యం బస్తాలు ట్రాన్స్‌పోర్ట్ కాక ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద 500 దాన్య రాసులు రైతులు పయగా వాటిలో సమారు 200 దాన్యం రాసులు తేమ శాతం పరీక్షించి తూకానికి అనుకూలంగా వున్నాయని తూకాలు వేయడానికి ట్రాన్స్‌పోర్ట్ అడ్డంకిగా మారిందని రైతులు అంటున్నారు.

రైతులు తమ ధాన్యం తూకం వేయడం లేదని తాము తమ ధాన్యం వద్ద ఎన్ని రోజులు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెం గ్రామానికి చెందిన జటంగి వీరస్వామి అనే రైతు మాట్లాడుతూ… తాను గత 14 రోజులగా వరి దాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నానని తన ధాన్యం తేమ పరీక్ష కూడా చేశారని ఇంత వరకు తుకం వేయడం లేదని తతా రోజు ఇంటి నుంచి తుంగతుర్తి రావడం, పోవడమే సరిపోతోందని అన్నారు. అలాగే గిరిజన రైతు గుగులోత్ భోజా మాట్లాడుతూ… తాను గత 10 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వుంటున్నా తన ధాన్యం తూకం వేయడంలో జాప్యం జరగుతోందని అన్నారు. రైతుల ధాన్యం ఎందుకు తూకాలు వేయడం లేదని సిఈఒ మెంకటేశ్వర్లను ప్రశ్నించగా ట్రాన్స్ పోర్ట్ లారీలు వచ్చేదాక తూకాలు వేయడానికి ఇబ్బందిగా ఉందని వేసిన బస్తాలే ఇంత వరకు ట్రాన్స్‌పోర్ట్ కాలేదని తెలిపారు.

ఇటీవల ఒకటి , రెండు రోజులుగా భారీ ఈదురు గాలులతో వస్తున్న ఆకాల వర్షాల వల్ల తమ ధాన్యం తడిసి పాడయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే తమ ధాన్యాన్ని తూకాలు వేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే తూకాలు వేసిన ధాన్యం బస్తాలను ట్రాన్స్‌పోర్ట్ లారీల ద్వారా తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా ట్రాన్స్‌పోర్ట్ లారీలు రాక తుంగతుర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిలిచి పోయిన ధాన్యం తూకాలను వెంటనే ప్రారంభించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

Farmers suffering at Paddy grain purchase center