Home ఖమ్మం రైతు ఆత్మహత్యల నేపథ్యంలో

రైతు ఆత్మహత్యల నేపథ్యంలో

రైతు ఆత్మహత్యల నేపథ్యంలో కాంగ్రెస్- టిఆర్‌ఎస్ మాటల యుద్ధం

 మీరంటే మీరు అంటూ పరస్పర ఆరోపణలు
 సవాళ్లు, ప్రతి సవాళ్లలో నాయకులు

kmm1ఖమ్మం : రైతు ఆత్మహత్యల వ్యవ హారం జిల్లా రాజకీయాలను వేడె క్కించింది. ఆరోపణలు, ప్రత్యా రోపణలో పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. కాంగ్రెస్ నేతలు రైతు ఆత్మహత్యలకు టిఆర్‌ఎస్ వైఖరే కారణమని, ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తుం డగా పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనే కారణమని టిఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. పనిలో పనిగా అభివృద్ధి, అవినీతి, బలాబలాలు, ఫిరాయింపుల విమర్శలతో మాటల యుద్దాలు సాగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర కార్యని ర్వాహక అధ్యక్షులు భట్టీ విక్రమార్క కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమా వేశంలో మాట్లాడుతూ ముగ్గురు సభ్యులున్న టిఆర్‌ఎస్ శాసన మండలికి ఎలా పోటీ చేస్తుందని ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు ఆత్మహత్యలకు టిఆర్‌ఎస్ వైఖరే కారణమంటూ రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. మరు సటి రోజే కాంగ్రెస్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, కెసిఆర్‌పైన పలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా టిఆర్‌ఎస్ నేతలు భట్టీ కమీషన్లు దండుకుంటున్నాడని, అభివృద్ది కార్య క్రమాలు చేపట్టలేదని, మమ్మల్ని చూసి మా పార్టీలో చేరుతున్నారని పేర్కొ న్నారు. టిఆర్‌ఎస్ నేత బాలసాని లక్ష్మి నారాయణ ఎప్పుడు జనం ఓట్లతో గెలవలేదని కాంగ్రెస్ తిప్పి కొట్టింది. ఇలా మాటల యుద్దం రోజు రోజుకు పెరుగుతుంది. దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ సవాల్ విసిరింది. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది.