Home తాజా వార్తలు అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

Farmerహైదరాబాద్ : అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్‌జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో పులగరి శంకర్(50) అనే రైతు అప్పుల బాధతో ఉరేసుకుని చనిపోయాడు. అదేవిధంగా కరీంనగర్‌జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.సైదాపూర్ మండలం గుజ్జలపల్లి గ్రామానికి చెందిన జి.పోచయ్య(45) అనే రైతు పంటలు ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు.