Home తాజా వార్తలు ఆగని రైతుల ఆత్మహత్యలు

ఆగని రైతుల ఆత్మహత్యలు

FARMER-SUICIDEహైదరాబాద్ : అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చ లేక వారు మరణశయ్య ఎక్కుతున్నారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలం అరూరులో రామిరెడ్డి అనే రైతు బలవన్మరణం పొందాడు. పొలం వద్దనే ఆయన పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరకొండ మండలం గిరిజానగర్ తండాలో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది.. వరంగల్ జిల్లా కురవి మండలం బంగారుగూడెం తండాలో బజ్జి అనేరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేటలో యువరైతు నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లిలో అప్పుల బాధతో సత్తిరెడ్డి అనే రైతు మరణాన్ని ఆశ్రయించాడు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కోట(కె) గ్రామంలో విశ్వనాథ్ అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.