Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు

FARMER-SUICIDEశంకర్‌పల్లి: అప్పుల బాధ భరించలేక రైతు ఇంట్లో నే ప్యాన్‌కు ఉరివేసుకున్న సంఘటన కొత్తపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. బాధిత కుటు ంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంగా మండల ంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శేరిగూడ యాదయ్య (45) తన కున్న ఎకరాతో పాటు 25 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, తదితర పంటలు సాగు చేశాడని తెలిపారు. ఈయనకు సుమారు రు.౩ లక్షల వరకు అప్పులుంటాయని తెలిపారు. పంటలు సరిగా పండక పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు పెరిగి ఎలా తీర్చాలంటూ మానసికంగా కృంగిపోయేవాడని వారు తెలిపారు. గత సంవ త్సరం కూతురు వివాహం కూడ చేయడంతో అప్పు లు మరిన్ని పెరిగి పోయాయి. ఈ సారైనా పంటలు సరిగా పండి అప్పులు తీరుద్దామనుకుంటే వర్షాలు సక్రమంగా కురవకపోవడం పంటలు కళ్లముందే ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలో తన తోటి రైతులతో బాధపడేవారని తెలిపారు. మృ తునికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు శంకర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ సంతోష్ తెలిపారు.
రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపిపి, వైస్‌ఎంపిపి …
కొత్తపల్లి రైతు కుటుంబాన్ని శంకర్‌పల్లి ఎంపిపి నర్సింలు వైస్ ఎంపిపి బద్దం శశిదర్‌రెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఖాదర్‌పాషా, శంకర్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు పార్శి బాలకృష్ణ తదితరులు పరామర్శిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వా నికి చీమ కుట్టినట్లు కూడ లేదని, గతంలో కాంగ్రెస్ హయాంలో, వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎన్నికలలో ఇచ్చిన హామీని రైతులకు ఒకేసారి రుణాలన్ని మాపీ చేసి కొత్త రుణాలిచ్చారని వార న్నారు. ఈ ప్రభుత్వం రుణమాపీని నాలుగు విడ తలుంటూ రైతుల జీవితాలతో చెలగాట మాడు కుంటుందని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం రైతు రుణమాఫీని ఒకే సారీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
శామీర్‌పేటలో…
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘ టన శామీర్‌పేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు అందించిన వివరాల ప్రకా రం శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేట గ్రామా నికి చెందిన ఈదులకంటి బాల్‌రెడ్డి(36) వృత్తి రీత్య వ్యవసాయం చేస్తు జీవిస్తున్నాడు. వేసిన పంటలలో తీవ్ర నష్టాలు రావడంతో అప్పులు పెరిగి పోయా యి. అప్పులు తీర్చేందుకు కొంత భూమిని విక్ర హించిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మన స్థాపానికి గురయ్యాడు. బాల్‌రెడ్డి లోతుకుంట పరి ధిలోని భూదేవినగర్‌లోని అత్తగారింటి వద్ద ఉన్న భార్య ప్రసన్, ఇద్దరి పిల్లలను చూడడానికి సోమ వారం రాత్రి అక్కడికి వెళ్లాడు. అప్పులు పెరిగి పోవ డంతో మనస్థాపానికి గురిఅయిన బాల్‌రెడ్డి రాత్రి పిల్లలతో మాట్లాడి మంగళవారం ఉదయం రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు కుటుం బం రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments