Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

FARMERమోమిన్‌పేట: పంటలు పండక తెచ్చిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘట న మోమిన్‌పేట మండల పరిధిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం మోమిన్‌పేట మండలంలోని బాల్‌రెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాదిగ చిన్నరాజయ్య బుదవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో క్రిమి సంహారక మందు తిన్నాడు. కాసేపటికి స్పృహకోల్పోయి ఉన్న అతనిని గమనించిన కుటుంబ సభ్యులు మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు తన గ్రామంలోనే 4 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు దర్యాప్తు చేస్తున్నారు.
ధారూర్‌లో…
ధారూర్: సరైన వర్షపాతంలేక, పంటకు నీళ్లు పారించలేక పెట్టిన పెట్టుబడి చేతికందే పరిస్థితి కనిపించక చేసిన అప్పులు తీర్చే దారి కనపడక పంటలకు పిచికారి చేసే పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధారూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తరిగోపుల గ్రామంలో గురువారం జరిగింది. ధారూర్ ఎస్సై-2 ప్రేమ్‌కుమార్ కథనం ప్రకారం మోరె శివాజి రావు (32) తనకున్న ఎకరం వరిచేనుకు నీళ్ళు పార బెట్టడానికి తెల్లవారుజామున 4గ॥లకు చేనుకు వెల్తున్నాని భార్య జయశ్రీ కి చెప్పి వెళ్ళి పురుగుల మందు సేవించి ఇంటికి రావడంతొ వాసన గ్రహించిన భార్య వికా రాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. అతనికి బయట చేసిన 2 లక్షల అప్పులు ఉన్నాయని, దానివల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుని భార్య జయశ్రీ పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపాడు.

Comments

comments