Home సంగారెడ్డి రైతు ఆత్మహత్యలు కెసిఆర్‌కు కనిపించడం లేదా..?

రైతు ఆత్మహత్యలు కెసిఆర్‌కు కనిపించడం లేదా..?

jagardy

* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సదాశివపేట రూరల్ : రైతులు ఆత్మహత్యలు చేసుకొని వారి కుటుంబాల్లో చీకటి నెలకొంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వానికి సిఎం కెసిఆర్‌కు రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కెసిఆర్‌పై మండిపడ్డారు. బుధవారం సదాశివపేట మండల పరిధిలోని నిజాంపూర్‌లో రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న రైతు పాపయ్య కుటుంబానికి రూ.లక్షరూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిఎం కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తూ, యువతను, రైతు బలిదానాలు చేసుకుంటున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అనంతరం తంగెడిపల్లిలో ఎల్లలింగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మమ్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మగ్దుంపటేల్, ఎంపిటిసిలు గంగయ్య, సంగమేశ్వర్,కాంగ్రెస్ నాయకులు మధు,హైటెక్ ఖదీర్, సంగయ్య, మల్లేశం, మాణిక్‌రెడ్డి, సర్పంచ్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.