Home రాష్ట్ర వార్తలు కేంద్రం వల్లే ఆత్మహత్యలు

కేంద్రం వల్లే ఆత్మహత్యలు

KCR

రైతు కుటుంబాల్లో విషాదానికి బిజెపి, కాంగ్రెస్ నిర్ణయాలే కారణం
డిఎల పెంపుపై చూపుతున్న శ్రద్ధను మద్దతు ధరపై చూపరు
రైతు ఓర్పును పరీక్షించడం భావ్యం కాదు : ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి

మన తెలంగాణ/ ఆదిలాబాద్ : జాతీయ పార్టీల అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, శాంతియు త వాతావరణానికి భంగం వాటిల్లుతుందని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా తలాపునే పెన్‌గంగా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టక పోవడంతో జిల్లాకు సాగు నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 70 వేల టిఎంసిల వర్షం కురుస్తుండగా, 24 వేల టిఎంసిల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామని మిగిలిన నీరంతా వృథా అవుతుందని, గణాంకాలు చూసైనా జాతీయ పార్టీలు తల దించుకోవాల్సిన అవసరముందన్నారు. రైతులకు మేలు చేస్తామని ప్రకటనలు చేస్తున్న కేంద్రం.. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను మాత్రం పెంచడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఎలను పెంచుతున్న సర్కా రు రైతుల విషయంలో మాత్ర అశ్రద్ధ చేయడంలో అంతర్యమేమిటని ప్ర శ్నించారు. ఈ విషయంలో అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసర ముందన్నారు. రైతుల సహనాన్ని పరీక్షించాలనుకోవడం భావ్యం కాదన్నా రు. గత పాలకుల కారణంగా వెనుకబాటుకు గురైన ప్రాంతాలను అన్నిరంగాలలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంపన్నమైందని, గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఏడాదిన్నర కాలంలో ఏకంగా కోటిన్నర ఎకరాల సాగుభూమికి నీటిని అందిస్తున్నామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న సమయంలోగా పూర్తి చేసి పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళికలను రూపొందించామని చెప్పారు. గత పాలకుల తెలివి తక్కువ విధానాలతో ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు అతీగతీలేకుండా పోయిందని, రీడిజైన్ చేయించి త్వరలోనే ఈ ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని ప్రకటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ముం దుందని పేర్కొన్నారు. 500 గురుకులాలను మంజూరు చేసి ప్రతి విద్యార్థిపై ఏడాదికి 1.10 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నామని అన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి గోడం నగేష్, జడ్‌పి చైర్‌పర్సన్ శోభారాణి, ఎంఎల్‌ఎలు రాథోడ్ బాపూరావ్, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, రేఖా శ్యాం నాయక్, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.