Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

ఫసల్ భీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

Farmers Use  Pasal Bheema Scheme In Suryapet Dist

మఠంపల్లి ః ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి మల్లికార్జునరావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో రైతులకు పంటల భీమా పథకాలపై అవగాహన కల్పించారు ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా పంట రుణాలు పొందని రైతులు తప్పనిసరిగా భీమా చేయించుకోవాలని సూచించారు. వాతావరణ ఆదారిత భీమా కింద పత్తి పంటకు ఈనెల 15వరకు, మిర్చి పంటకు ఈనెల 31వరకు, జొన్న, మొక్కజొన్న,కంది, పెసర, వేరుశనగ, సోయాబీన్, పసుపు గుర్తించిన పంటలకు జూలై 15వరకు,, వరిపంటకు అగస్టు 31వరకు గడువు ఉన్నదని రైతులు సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు వంగవేటి వేణుగోపాలరావు, ఎఇఓలు శ్యామ్, భవన్, జాన్సిరాణి, రైతులు పాల్గొన్నారు.

Comments

comments