Search
Tuesday 20 November 2018
  • :
  • :

పంట పోలాల్లో దిష్టిబొమ్మలుగా మోదీ,అమిత్ షా కటౌట్లు

Farmers Using  Modi and Amit Shah cutouts as scarecrafts

బెంగళూరు: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకర్షించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలు పూర్తి అయింది. అనూహ్య పరిణామల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా  జెడిఎస్ సీనియర్ నేత కుమారస్వామి  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ , జెడిఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీగా ర్యాలీలను నిర్వహించాయి. దీని కోసం ఆయా పార్టీలు తమ పార్టీ అధ్యక్షులు, అగ్రనేతల ప్లెక్సీలు, కటౌట్లను రహదారులు, సభాప్రాంగణంలో భారీగా ఏర్పాటు చేశాయి. ఎన్నికలు ముగిసిన తరువాత వాటిని రైతులు తమ వెంట తీసుకెళ్లి పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు దిష్టిబొమ్మలుగా తయారు చేసి తమ పొలాల్లో వాడుకుంటున్నారు.

 

Comments

comments