Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘ఆకాశం వైపు అన్నదాత’ ఎదురుచూపులు

Farmers Waiting For Rain Fall In Warangal District

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : అన్నదాతలకు కష్టం వచ్చింది. ఖరీఫ్ కన్నీరు మిగిల్చే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఎంతో ఆశలతో ఖరీఫ్‌కు సిద్ధ్దమైన రైతన్నలు వర్షాలు లేక కంగారు పడుతున్నారు. ప్రభుత్వ పంటపెట్టుబడి కోసం పెట్టుబడి సహాయాన్ని అం దించడం, ఖరీఫ్ సీజన్ సైతం మొదట్లో దొందరపెట్టడంతో రైతుల ఆశలు ఆకాశానికంటాయి. కానీ ఆదే ఆశలతో ప్రస్తుతం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమైన రైతులు పత్తి, మొక్కజొన్న, పసుపు లాంటి పంటలకు విత్తనాలు వేశా రు. రేగడి దుక్కులు అనువుగా ఉన్నాయని ఆశించినప్పటికీ వర్షాలు అనుకూల వాతావరణం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడం నీరు సక్రమంగా అందకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 50 శాతం విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతన్న లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే వరి సాగుకు కూడా సిద్ధమైన రైతులు నార్లు సైతం పోశారు. వర్షాలు మారం చేయడంతో ఆకాశం వైపు రైతులు పడిగాపులు కాస్తున్నారు. రేగడి నేలలు కాస్త అనుకూలిస్తాయనుకుంటే అసలే నీరు లేకపోవడంతో చౌకనేలలు, రేగడి నేలలు మొలకెత్త డానికి మొండికేస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రభుత్వం పంటరుణం ఇచ్చిందనే సంబురాలు కూడా లేకుండా ప్రకృతి కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తోందిని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజలుఉ వాతావరణం కనికరించకపోతే రైతులకు గడ్డుకాలం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపంటకు సాగునీరందిస్తామని పాలకులు చెప్పే మాటలు ప్రస్తుతం ఆచరణలో లేకపోవడంతో రైతుల సంఘాలు ముక్కువిరుస్తున్నాయి. అటు ప్రభుత్వం అందించిన పెట్టుబడి రుణాలుతో పాటు ఇంకాస్త పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసిన రైతన్న ప్రస్తుతం ఖరీప్ వాతావరణం అనుకూలించకుంటే తీవ్రంగానే నష్టపోవాల్సివస్తోందని, దుక్కులు దున్నటానికి సైతం అదనపు భారం భరించాల్సి వస్తుందనే రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు విత్తనాల కొనుగోలులో అనేక విధాలుగా ఖర్చులు భరించిన రైతులకు కాలం మరో రూపంలో నష్టం చేస్తోందనే ఆవేదన చెందుతున్నారు. ఎదైమైన ప్రభుత్వం అందించిన పంటరుణాల సంబురాన్ని కాలం కరిగించిందని, ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు నాటిన రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారనేది గమనార్హం. మరో నాలుగైదు రోజల వరకు వాతావరణం కరుణించకపోతే రైతులకు తీరని నష్టం వాటిళ్లకతప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

comments