Home జోగులాంబ గద్వాల్ రైతులకు అండగా రైతుబంధు

రైతులకు అండగా రైతుబంధు

Farmers' welfare is the main objective

రైతుల సంక్షేమమే సీఎం ద్యేయం
రెండు నెలల్లో తుమ్మిళ్ళను కెసిఅర్ తో ప్రారంభిస్తాం
జెడ్పిచైర్మన్ బంఢారి భాస్కర్, మాజీ ఎంపి మందాజగ్ననాథం

మనతెలంగాణ/రాజోళి: దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టి రైతులకు పెట్టుబడి సహాయం అందించి ఆదుకోవడమే కెసిఅర్ ఉద్దేశమని జెడ్పిచైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. గురువారం రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎంపి మంధాజగ్ననాథం, వైస్‌ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాసులుతో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పిచైర్మన్ మాట్లాడుతూ గతపాలకులు చేయలేనిది కేసిఅర్ నాలుగేళ్ళలో చేసి చూపించారని, 24గంటల విద్యుత్తు, హాస్టల్లో సన్నబియ్యం, కళ్యాణలక్ష్మీవంటి పథకాలతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. నడిగడ్డ సస్యశ్యామలం కోసం చేపట్టిన తుమ్మిళ్ళ ఎత్తిపోతలను మరో రెండు నెలల్లో సిఎం కేసిఅర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మందా జగ్ననాథం మాట్లాడుతూ ఆంధ్రపాలకులతో వట్టిపోయిన అర్‌డిఎస్‌తో నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు తుమ్మిళ్ళను నిర్మాణానికి పునాది పడిందని, విత్తనాలు, ఎరువులు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రైతులకు సకాలంలో సరిపడినంతా సరాఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ప్రమాద భీమాను రూ. 5లక్షల వరకు పెంచామని, ఎలాంటి భేధాప్రాయం లేకుండా ప్రతి ఎకరాలకు రూ.4వేలు పంపిణీ చేస్తున్నామన్నారు. వైస్‌ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో లేనటువంటి పథకాలకు రైతు బిడ్డాగా కేసిఅర్ సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే రైతులకు రూ. 8వేల చొప్పున రెండువిడుతల్లో అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటేశ్వరమ్మ గోపాల్, ఎంపిటిసీలు బసన్న, నాగన్న, ఏడివో ఖాద్రి, తహశీల్దార్ వరలక్ష్మీ, సర్పంచ్ మోచివుసేన్, ఉపసర్పంచ్ దస్తగిరి, ఎస్‌ఐ మధుసుదన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.