Home మంచిర్యాల దుబ్బగూడ ప్రాజెక్టు పనులను అడ్డుకున్న రైతులు

దుబ్బగూడ ప్రాజెక్టు పనులను అడ్డుకున్న రైతులు

Farmers who blocke the dhubuguda project work

మన తెలంగాణ/కన్నెపల్లి: కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న  దుబ్బగూడ ప్రాజెక్టు పనులను శనివారం నాడు భూనిర్వాసితులు నష్టపరిహారం అందించడంలో అధికారులు  నిర్లక్షం చేస్తున్నారని, నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు పనులు  అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎస్‌ఇ సుశీల్‌కుమార్ అక్కడికి చేరుకొని,  రైతులతో మాట్లాడారు. ముంపుకు గురయిన భూములు  సంవత్సరాలు గడుస్తున్న నష్టపరిహారం అందించడం లేదని, నష్టపరిహారం అందే వరకు  పనులు నడవనివ్వమని, ఎక్కువగా ముంపుకు గురైన భూమిని, తక్కువ రికార్డుల్లో పొందుపర్చారని ,  గత రెండు  నెలల క్రితం  బెల్లంపల్లి సబ్ కలెక్టర్  రాహుల్‌రాజ్ నిర్వాసితులతో  భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించి, అందరికి నష్టపరిహారం నెల రో జుల్లో అందిస్తామన్నారు. కాని ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంపై భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందే వరకు పనులను అడ్డుకుంటామన్నారు. రెవెన్యూ  అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించడంతో పా టు రికార్డులో  నమోదైన విస్తీర్ణాన్ని లాభం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ వెంట డిఇ సత్యనారాయణ,ఏఇ వేణుగోపాల్, సర్పంచ్ అశోక్‌గౌడ్, మల్లయ్య, నాయకులు లక్ష్మణ్ గౌడ్, రౌతులు పాల్గొన్నారు.