Home మెదక్ ఆ అస్థిపంజరం ఫాంహౌస్ సూపర్‌వైజర్‌దే..!

ఆ అస్థిపంజరం ఫాంహౌస్ సూపర్‌వైజర్‌దే..!

Vidyadhar-Singh

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వర్మి కంపోస్ట్ ఎరువులో లభించిన అస్థిపంజరం కేసులో మనోహరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ అస్థిపంజరం జీడిపల్లిలోని ప్రేమ్‌చంద్ ఫాంహౌజ్‌లో సూపర్‌వైజర్ విధులు నిర్వహించిన విద్యాధర్‌సింగ్ (54)గా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో శాస్త్రీయంగా మృతుడిని గుర్తించేందుకు మాత్రం డిఎన్‌ఎ నివేదిక అత్యంత కీలకం కానుంది. ప్రేమ్‌చంద్ ఫాంహౌజ్‌లోని ఎరువు ఖరీదు చేసిన సూపర్ సీడ్స్ కంపెనీ తన వ్యవసాయ క్షేత్రంలో ఎరువు చల్లుతుండగా అందులో మానవ దేహానికి సంబంధించిన తల, చేతులు, కాళ్ల ఎముకలు బయటపడిన విషయం తెలిసిందే.