Search
Wednesday 14 November 2018
  • :
  • :

వేగంగా కాళేశ్వరంపనులు

map

*నిర్మల్ జిల్లా రైతులతో కలిసి సుందిళ్ల
బ్యారేజీ, అన్నారం పంపుహౌస్‌లను
పరిశీలించిన:
*దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మనతెలంగాణ/మంథని/మంథనిరూరల్:యుద్ధ ప్రతిపాదికన,రాత్రి, పగలు తేడా లేకుండా పనులు చేపడుతూ లక్షలాది ఎకరాలకు సాగునీటితో, తాగునీటిని అందించే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఏడాడి కాలంలోనే చివరి దశకు రావడం ఆశ్చర్యకరమని దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం మంథని మండలం సిరిపురంలో నిర్మిస్తున్న సుం దిళ్ల బ్యారేజీ,గుంజపడుగు కాసిపేటలో నిర్మిస్తున్న అన్నా రం పంపు హౌస్ నిర్మాణ పనులను ఆయన నిర్మల్ జిల్లాలో ని నిర్మల్,మధోల్,ఖానాపూర్ నియోజవర్గాలకు చెందిన సుమారు 500మంది రైతులతో కలిసి పరిశీలించారు. సం బంధిత శాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ని ర్మాణం,ఆయకట్టు తదితర అంశాలను మ్యాప్ ద్వారా ఇం ద్రకరణ్‌రెడ్డికి వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త సిఎం కెసిఆర్ అని,తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రా జెక్టు పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, జూన్, జూలై నుంచి కాళేశ్వరం నుంచి నీటిని తరలించడానికి పూర్తి స్థా యిలో ప్రయత్నాలు చేస్తున్నదన్నారు.
ప్రాజెక్టుల కోసం అప్పులు చేయడం తప్పుకాదని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించా రు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని రైతులు వచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలని పిలుపు నిచ్చారు. ఆయ న వెంట సుందిళ్ల బ్యారేజీ సుందిల్ల బ్యారేజీ ఇఇ విష్ణు ప్రసాద్, డిఇలు వెంకటేశ్వర్లు, మధుసూధన్, అన్నారం ప ంపు హౌస్ నిర్మాణ సంస్ధ మెగా కంపెనీ జిఎం సతీష్, ఎజి ఎం జనార్ధన్, సుందిల్ల బ్యారేజీ నిర్మాణ సంస్థ నవయుగ ప్రాజెక్టు మేనేజర్ ఈశ్వర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Comments

comments