Home తాజా వార్తలు మానసిక ఒత్తిడితో తండ్రి, కొడుకు ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో తండ్రి, కొడుకు ఆత్మహత్య

Suicidwe

జవహర్‌నగర్ : మానసిక వ్యధతో ఓ తండ్రి తన కుమారుడితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సం ఘటన బుధవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెన్నాపురంలో చోటుచేసుకుంది.  పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లాకు ధార రామయ్య, విజయ దంపతులు బతుకు దెరువు నిమిత్తం నగరంలోని బాలాజీనగర్‌కు వలస వచ్చారు. వీరి కుమారుడు ధార సుధీర్ ( 42), రజని దంపతులకు ధార తేజ (13) ధార కార్తిక్‌లు కుమారులు. సుధీర్ గత కొంత కాలంగా బాలాజీనగర్‌లోని పాతబస్తీలో శ్రీనివాస మెడికల్ షాప్‌ను నిర్వహిస్తూ శ్రీరాంనగర్ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. కుమారులు తేజ 7 వ తరగతి, కార్తిక్ 3వ తరగతి నేరెడ్‌మెట్‌లోని భవన్స్ పాఠశాలలో చదువుతున్నారు. కాగా ఇటివల కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ కొంత నష్ట పోవడంతో ఇంట్లో తల్లిదండ్రులు , బందువులు మందలించారు. అంతేగాక కుమారుడు తేజ 7వ తరగతిలో ఫెయిల్ కావడం కూడా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
గత కొన్ని రోజులుగా జీవితం పట్ల విరక్తితో మాట్లాడుతూ తాను ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులు, భార్యతో అనేవాడు. దీనిపై వారు మందలించిన అతనిలో ఎలాంటి మార్పులేదు. మూడు రోజుల క్రితం ఇంట్లో పెద్ద కుమారుడిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికిన లాభం లేకుండా పోయింది. సోమవారం రాత్రి ఇంటికి వస్తున్న అని చెప్పి తన సోదరుడి సెల్ ఫోన్‌కు మెసెజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. అదే రాత్రి బాలాజీనగర్‌లోని చెన్నాపురం చెరువులో తన కుమారుడితో కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం రెండు శవాలు నీటిలో తేలియాడుతుండటంతో చూసిన స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్‌ఐలు సైదులు ఉదయ్‌బాస్కర్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను చెరువులో నుంచి వెలికి తీశారు. సమాచారం అందుకున్న భార్య , తల్లిదండ్రులు సంఘటన చేరుకుని భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మిన్నంటిన రోధనలు…. కాగా గత 20 సంవత్సరాలుగా మెడికల్ షాప్‌ను నిర్వహిస్తూ అందిరిలో మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ ఆత్మహత్య చేసుకున్నడన్న సమాచారంతో జనం తండోపతండాలుగా చెన్నాపురం చెరువుకు చేరుకుని అయ్యే పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోపక్క తల్లిదండ్రులు, భార్య రోదనలతో ఆ ప్రాంతంమంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికి మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.