Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

విద్యుదాఘాతంతో తండ్రి,కొడుకు మృతి

Father and Son Killed by Electric shock

ఖమ్మం : రఘునాథపాలెంలో సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం శివారులోని బల్లెపల్లిలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా విద్యుదాఘాతంతో తండ్రి,కొడుకు చనిపోయారు. మృతులు రఘునాథపాలెంకు చెందిన బానోత్ శంకర్, వెంకటేశ్‌గా గుర్తించారు. శంకర్ గ్రామపంచాయతీ వార్డు మెంబర్‌గా ఉన్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father and Son Killed by Electric shock

Comments

comments