Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గొడ్డలితో కొడుకును నరికిన తండ్రి

murder

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని బజార్ వాడి కాలనీలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. నారాయణ అనే వ్యక్తి తన కన్న కొడుకు యువరాజ్‌పై గొడ్డలితో దాడి చేశాడు. యువరాజ్ తాగుడుకు బానిసై తరుచూ ఇంట్లో గొడవ పెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో నారాయణ కొడుకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొడుకు ఆగడాలకు కోపోద్రిక్తులైన తండ్రి యువరాజ్‌పై గొడ్డలితో నరికాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయాలపాలైన యువరాజ్‌ను చికిత్స నిమిత్తం మంచిర్యాల దవాఖానకు తరలించారు.

Comments

comments