Home తాజా వార్తలు కూతురి వద్దే తండ్రి లక్షలకు లక్షలు వడ్డీ వసూలు

కూతురి వద్దే తండ్రి లక్షలకు లక్షలు వడ్డీ వసూలు

Father Collects High Interest from Daughter in Andhra Pradesh

అమరావతి: గత కొంత కాలంగా ఎపిలో కాల్ మనీ మాఫియా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే కొవలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురి వద్దే తండ్రి లక్షలకు లక్షలు వడ్డీ వసూలు చేసిన ఉదంతమిది. గంపలగూడెం మండలం తునికిపాడు మండల పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడి ఉన్న కిలారు హనుమంతరావు తన కుమార్తె చంద్రలేఖకు రూ. 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వీటిపై చక్రవడ్డీలు వేస్తూ ఇప్పటి వరకు 15 లక్షల వరకు వసూలు చేశాడు. ఇంకా 5 లక్షలు చెల్లించాలంటూ చంద్రలేఖకు చెందిన నాలుగున్న ఎకరాలలో పంట పండించుకోకుండా అడ్డుపడుతున్నాడు. దీంతో దుబాయ్‌లో ఉన్న చంద్రలేఖ ఇంటికి వచ్చింది. అనంతరం కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. చంద్రలేఖ ఫిర్యాదుకు వెంటనే స్పందించిన కలెక్టర్‌ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.