Home ఆదిలాబాద్ బాధలోనూ ఆత్మస్థైర్యం

బాధలోనూ ఆత్మస్థైర్యం

తండ్రులు మృతి చెందినా పరీక్షకు హాజరైన విద్యార్థులు

Student

మెట్‌పల్లి: ఓవైపు తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. ఏం చేయాలో తెలియని పరిస్థితి. పుట్టెడు దుఃఖంలోనూ ఆత్మస్థైర్యంతో పదో తరగతి పరీక్ష రాశారు ఇద్దరు విద్యార్థులు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ ఘటన గ్రామస్థులు, బంధువులను కంటతడి పెట్టిం చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన దొగ్గలి వెంకటేశ్ అనే విద్యార్థి తండ్రి భూమన్న(48) శనివారం అనారోగ్యంతో జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే పదో పరీక్షలు రాస్తున్న వెంకటేశ్‌కు అదేరోజు భౌతికశాస్త్రం పరీక్ష రాయాల్సి ఉంది. బంధువులు చెప్పిన ధైర్యంతో వెంకటేశ్ పరీక్షకు హాజరయ్యాడు. అలాగే జగిత్యా జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడకు చెందిన వాల్గ్గొట్ రాజ్‌పాల్ (43) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అతడి చిన్న కుమారుడు నరేశ్ పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఓవైపు అంత్యక్రియలు ఉండగా, కరస్పాండెంట్ మహర్షి నరేశ్‌కు ధైర్యం చెప్పడంతో పరీక్ష రాశాడు. ఆ తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యాడు.