Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

తనయునితోనే తండ్రి

మృతదేహంపై పడి తుదిశ్వాస విడిచిన తండ్రి

బుచ్చన్నగూడెంలో విషాద ఛాయలు

Dead

చండ్రుగొండ: తన ఆశల సౌధం కుప్ప కూలిపోవడం ఆ తండ్రిని కుందీసింది. తన కల సాకారమయ్యే దశలో చెదిరిపోవడం ఆ తండ్రిని ఛిన్నాభిన్నం
చేసింది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా చూసుకున్నకొడుకు తన కళ్లముందే పాడెపై పడి ఉండడం ఆ తండ్రినికోలుకోలేకుండా చేసింది. తనకు తలకొరివి పెట్టాల్సినకొడుకును అలా చూసి తట్టుకోలేక ఆ తండ్రి కూడితనయునివద్దకే చేరాడు. ఈ విషాదకర సంఘటనఅన్నపురెడ్డిపల్లి మండలంలోని బుచ్చన్నగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన మెచ్చు రామారావు (36) కూలి పని చేస్తూ జీవించేవాడు.

ఈక్రమంలో పని ప్రదేశంలో ప్రమాదం జరగడంతో తలకు తీవ్రమైన గాయ మైంది. రామారావు తండ్రి వేదప్ప(60) కుమారుడిని వైద్యం చేయించాడు. అయినప్పటికీ అప్పుడప్పుడూ రామారావు అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం సైతం కూలి పనులకు వెళ్లిన రామారావు కిందపడి కాళ్లూచేతులు చచ్చుబడ్డాయి. వెంటనే అతడిని కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామంలో ఇంటికి తీసుకొచ్చారు. పనికివెళ్లిన తండ్రికి విషయాన్ని తెలియజేశారు. కొడుకు చని పోయాడనే విషయాన్ని తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. కొడుకు మృతదేహంపై పడి గుండెల విసేలా రోదించాడు. కొడుకు మృతదేహంపై పడి అలాగే తుదిశ్వాస విడిచాడు. తండ్రీ కొడుకులు మృతిచెందడంతో కుటుం బంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు రామారావుకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Comments

comments