Home కామారెడ్డి తండ్రి మరణించినా.. పరీక్ష రాసిన విద్యార్థి

తండ్రి మరణించినా.. పరీక్ష రాసిన విద్యార్థి

father dies
మన తెలంగాణ/కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లాలో తండ్రి ఛాతినొప్పితో బాధపడు తూ మరణించిన దుఃఖాన్ని సైతం దిగమింగి పదవ తరగతి పరీక్షలు హాజరైనాడు ఓ విద్యార్థి. కామారెడ్డి మండలంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన దాండిగె ప్రణీత్ స్థానిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా రు. ప్రణీత్ తండ్రి దాండిగె మదన్ (42) శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు ఛాతిలో నొప్పి వస్తుందంటూ చెప్పాడు. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళే క్రమంలో హఠాన్మరణం చెందాడు. అయితే తండ్రి మృతి చెందిన బాధను దిగమింగుకొని ప్రణీత్ శనివారం జీవదాన్ పాఠశాలలో తెలుగు పరీక్షను రాశాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని తలకొరివి పెట్టాడు. ఈ విషయాన్ని చూసిన పలువురు గ్రామస్తులు కంతడి పెట్టారు. వీరు బతుకుదెరువు కోసం గత పదేళ్ల క్రితం నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చారు. మదన్‌కు భార్య కల్పన, కూతురు, కొడుకు ప్రణీత్ ఉన్నారు.

father dies student attend the 10th class exam