Home ఆఫ్ బీట్ కూతురికి ఆవును కానుకగా ఇచ్చిన తండ్రి

కూతురికి ఆవును కానుకగా ఇచ్చిన తండ్రి

COW

హరియాణా : పెళ్లికూతురికి ఓ ముస్లిం వ్యక్తి ఆవును కానుకగా ఇచ్చాడు. ఈ ఘటన సోనిపటి జిల్లాలో జరిగింది. నూర్‌ఖాన్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి చేశాడు. ఈ క్రమంలో అతను పదిహేను వేలు పెట్టి ఓ దేశీయ ఆవును కొనుగోలు చేశాడు. ఈ ఆవును తన కూతురైన పెళ్లికూతురుకు కానుకగా ఇచ్చాడు. తన కూతురుకు ఆవులంటే చాలా ఇష్టమని, అందుకే ఆవును కానుకగా ఇచ్చానని నూర్‌ఖాన్ తెలిపారు. ఇప్పటికే దేశంలో గోవుల సంరక్షణ వంటి విషయాలపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ఆవును పెళ్లికి కానుకగా ఇవ్వడం హరియాణాలో ఇదే మొదటి సారి అని పలువురు చెబుతున్నారు.