Search
Tuesday 20 November 2018
  • :
  • :

తండ్రి చేతిలో కూతురు హతం…

father killed his daughter in rangareddy
రంగారెడ్డి: నగర శివారుల్లో ఓ పరువు హత్య సంచలనం సృష్టించింది… కన్న కూతురిని గొంతు కొసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి.. ప్రేమ పెళ్లి చేసుకుందని పగలతో రగిలిపోయిన తండ్రి గర్భీణి అని చూడకుండా కన్న కూతురిని కత్తితో గొంతు కోసి చంపిన ఘటణ రాచకొండ కమీషనరేట్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కేంద్రంలో ఎస్సి కాలనీలో ఎల్లంకి సుక్కమ్మ, క్రిష్టయ్యల దంపతుల కుమారుడు ఎల్లంకి సురేష్(27) ఉంటున్నారు. సురేష్ ఇంటి పక్కనే ఉండే మంగలిపల్లి నర్సయ్య, నర్సమ్మల దంపతుల కూతురు విజయలక్ష్మీ(27)లు ఉండేవారు. సురేష్, విజయలక్ష్మీలు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. కొంత కాలం తర్వాత పెద్దల అంగికరంతో విజయలక్ష్మీ, సురేష్‌లు పెళ్లి చేసుకోవాలని భావించారు. కాగా.. విజయలక్ష్మీకి సురేష్ దూరపు వరుసకు బాబాయి కావడం విజయలక్ష్మీ తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగికరించాలేదు. దాంతో సురేష్, విజయలక్ష్మీలు 2014 జనవరి 4న ఇంట్లో నుండి వెళ్లి భద్రచలంలో పెళ్లి చేసుకున్నారు.

అనంతరం విజయలక్ష్మీ తల్లిదండ్రుల నుండి రక్షణ కల్పించాలని హయత్‌నగర్ పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇరువురు పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అయితే విజయలక్ష్మీకి సురేష్ వరుసకు బాబాయి కావడం ప్రేమ పెళ్లికి సయోద్య కుదరలేదు. ఇక్కడ ఉంటే గొడవులు జరుగుతాయని భావించిన నాలున్నర ఏళ్ల క్రితమే భద్రచలంకు వెళ్లి సురేష్ మేస్త్రీ పని చేస్తు తన భార్య విజయలక్ష్మీతో జీవనం సాగిస్తున్నాడు. వీరికి నాలుగు ఏళ్ల కుమారుడు రఘు ఉన్నాడు. ప్రస్తుతం విజయలక్ష్మీ 7 నెలల గర్భీణి. ఇదిలా ఉండగా సురేష్ తల్లి ఆగస్టు 19న అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రంలో ఎల్లంకి సుక్కమ్మ(పారిశుద్ద కార్మికురాలు)ని టిప్పర్ ఢీకొట్టి తీవ్రంగా గాయపడి గాంధీలో చికిత్స పొందుతూ.. మృతి చెందింది. దాంతో సురేష్, విజయలక్ష్మీల దంపతులు అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెరుకున్నారు. తల్లి అంత్యక్రియలు అనంతరం సురేష్ విజయలక్ష్మీ అక్కడనే ఉన్నారు. గత నాలుగున్నర ఏళ్ల నుండి సురేష్‌పై కూతురు విజయలక్ష్మీపై తల్లిదండ్రులు, బంధువులు పగతో రగిలిపోతున్నారు. ఇదే అదునుగా భావించి గురువారం ఉదయం 8 గంటల సురేష్ ఇంట్లో ఉండగానే బయట ఉన్న విజయలక్ష్మీ వద్దకు తల్లి వచ్చింది.

తమ పరువు తీస్తావా అంటూ విజయలక్ష్మీని బలవంతగా ఇంటి నుండి కొట్టుకుంటు తల్లి నర్సమ్మ పిన్ని వనమ్మ, తన బంధువుల సహయంతో సమీపంలోని ఎస్సి కమ్యూనిటిహాల్‌లో లాకెళ్లి తలుపుపెట్టింది. అప్పటికే కమ్యూనిటిహాల్ లోపల ఉన్న తండ్రి నర్సయ్య బాబాయిలు గణేష్, మైసయ్య, తమ్ములు లవకుమార్, శివకుమార్‌లు బందువులతో కలిసి కూతురు విజయలక్ష్మీని కొట్టి గొంతు నులిపి కత్తితో గొంతు కోసి చంపాడు. కత్తితో బయటకు వచ్చి సమీపంలోని బోరు వద్ద కత్తిని కడిగి అక్కడి నుండి నేరుగా పోలీసులకు లొంగిపోయ్యాడు. స్థానికులు గమనించి భయంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిఐ ముని తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. వనస్థలిపురం ఎసిపి గాంధీనారయణ హత్య జరిగిన కమ్యూనిటిహాల్‌కు చేరుకుని హత్యకు గల కారణలను తెలుసుకున్నారు. మృతురాలు విజయలక్ష్మీ భర్త సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యను హత్య చేసిన వారిని కఠింణంగా శిక్షించాలని సురేష్ కోరారు.

Comments

comments