Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

నాన్నా.. నేనేం పాపం చేశా..

తొమ్మిది నెలల కూతురును గొంతునులిమి హత్య చేసిన కసాయి తండ్రి

babyఆత్మకూర్:  ఆత్మకూర్‌లో అత్యంత ధారుణం జరిగింది. అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకొంది. సమాజంలో ఆడపిల్ల పుట్టడమే నేరమైపోయిపోయినట్టుమరోసారి వివక్షబయటపడింది. రక్తం పంచుకుని పుట్టిన కూతురును అల్లారు ముద్దుగా అలనాపాలన చూడాల్సిన ఓ కసాయి తండ్రే కాలయముడయ్యాడు. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి అదోలా ఉన్న తండ్రి మంగళవారం సాయంత్రం కూతురును బైక్‌పై ఎక్కించుకుని
బయటకు తీసుకువెళ్ళి ముక్కుపచ్చలారని తొమ్మిది నెలల కూతురును అత్యంత పాశవికంగా గొంతునులిమి చంపాడు. సభ్యసమాజం నివ్వెరపా
టుకు గురిచేసిన ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూల్ జిల్లా దేవరబండకు చెందిన ఈశ్వర్ అనే వ్యక్తికి గద్వాల జిల్లా ఐజ మండలం కిష్టాపూర్‌కు చెందిన పార్వతితో గత మూడేళ్ళ కిందట వివాహమైంది. దంపతులు గత కొంతకాలంగా ఆత్మకూర్ రామ కృష్ణ కాలనిలోని ఓ అద్దె ఇంటిలో నివాసముంటూ అప్పడాల వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే గర్భం దాల్చిన పార్వతి గత పదిహేను నెలల కిందట కాన్పు కోసం తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి తొమి ది నెలల కిందట ఆడకూతురుకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టాలని అనేక దేవుళ్ళను వేడుకున్న ఈశ్వర్‌కు ఆడబిడ్డ పుట్టడంతో నిస్సహాయతకు గురయ్యాడు.

గత తొమ్మిది నెలలుగా బార్య బిడ్డలను చూడడానికి కూడా పోకుండా ఓ సైకోగా మారాడు. వారం రోజుల కిందట పెద్దల చర్చల ద్వారా బార్య బిడ్డలను ఆత్మకూర్‌కు తీసుకువచ్చిన ఈశ్వర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురును బైక్‌పై తీసుకెళ్ళి గొంతునులిమి హత్యచేసి తిరిగి ఇంటికి వచ్చి బైక్‌పైనుంచి కూతురు కిందపడి చనిపోయిందని నమ్మబలికాడు. భర్త ఈశ్వర్ తీరుపై అనుమానం కలిగిన బార్య పార్వతి తల్లిదండ్రులకు, పోలీసు లకు సమాచారం ఇచ్చింది. బంధువులు, పోలీసులు నిలదీయడంతో కూతురును గొంతునులిమి చంపినట్లు ఈశ్వర్ అంగీకరించాడు. ఇదిలా ఉండగా
చిన్నారి బేబిహిందు మృతదేహానికి శవ పంచనామ నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని తండ్రి ఈశ్వర్‌ను అందుపులోకి తీసుకుని ధర్యాప్తు కొనసాగిస్తున్న ఎస్‌ఐ రాజు తెలిపారు.

Comments

comments