Home జాతీయ వార్తలు తండ్రి చేతిలో తనయుడు హతం…

తండ్రి చేతిలో తనయుడు హతం…

Father Kills Own Son

అంబాలా:  మద్యం మత్తు లో ఓ తండ్రి కన్న కొడుకునే  హత్య చేసిన సంఘటన హరియాణాలోని అంబాలా నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తప్ప తాగి వచ్చిన నిందితుడు జోరావార్ సింగ్ భార్యపై గొడవపడి అనంతరం దాడికి దిగాడు. విచక్షణ రహితంగా తల్లిని కొడుతూ ఉండటంతో కొడుకు నవజోత్ తండ్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆవేశంలో కత్తితో కొడుకుపై దాడి చేశాడు. మెడపై అనేక సార్లు పొడవడంతో నవజోత్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన నవజోత్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.