Home కరీంనగర్ తండ్రే అత్యాచారం, హత్య చేశాడు..!

తండ్రే అత్యాచారం, హత్య చేశాడు..!

Mounika-Died-Brideహైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటలో వివాహిత అపహరణ, హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మౌనికను ఆమె తండ్రి భూమళ్ల మల్లయ్య హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆషాఢమాసం కోసం శనివారం రాత్రి ఆమె భర్త దగ్గర నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్తూ మార్గ మధ్యంలో అత్యాచారానికి యత్నించాడు. మౌనిక ప్రతిఘటించడంతో చీర కొంగుతో ఉరిబిగించి హత్య చేశాడు. అసలు విషయం దాచి కుమార్తెను ఇద్దరు వ్యక్తులు అపహరించారని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం దేశాయిపేట సమీపంలో మౌనిక మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మౌనిక తండ్రిని విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.