Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

‘పాన్ కార్డు’పై కేంద్రం మరో కీలక నిర్ణయం!

Father's name may not be mandatory on PAN card

న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం అన్నీ కీలక చెల్లింపులకు పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాన్ కార్డుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ కార్డులో తండ్రి పేరు ఉండటం తప్పనిసరేమి కాదని వెల్లడించింది. కార్డులో తండ్రి పేరు ఉండాలన్న నిబంధనను త్వరలోనే సవరిస్తామని స్పష్టం చేసింది. సింగిల్ పేరెంట్ (తల్లి మాత్రమే ఉన్న) ఉన్నవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం దరఖాస్తు 49ఎ, 49ఎఎలో సవరణలు చేస్తూ ముసాయిదాను విడుదల చేయడంతో పాటు దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17లోపు తెలియజేయాలని కేంద్రం కోరింది.

Comments

comments